Amazon : రోజుకు 4 గంటలు..రూ. 60 వేలు సంపాదన

డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు నెలలో రోజుకు 4 గంటలు పనిచేస్తే..సుమారు రూ. 55 వేల నుంచి రూ. 60 వేల వరకు వస్తాయని అమెజాన్ వెల్లడిస్తోంది. ఒక ప్యాకేజీ డెలివరీ చేస్తే..సుమారు రూ. 10 నుంచి రూ. 15 కమిషన్ వస్తుంది.

Amazon : రోజుకు 4 గంటలు..రూ. 60 వేలు సంపాదన

Amazon

Earn Rs 60 Thousand Every Month : రోజుకు కేవలం 4 గంటలకు పని చేస్తే..చాలు రూ. 60 వేలు సంపాదించొచ్చు అంటోంది అమెజాన్. డెలివరీ సేవల్లో అమెజాన్ సంస్థ ప్రముఖ స్థానం సంపాదించింది. ఇందులో డెలివరీ బాయ్స్ కీలక పాత్ర పోషిస్తుంటారు. కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులను ఇంటి వద్దకే డెలివరీ చేసే సంగతి తెలిసిందే. డెలివరీ సేవలను మరింత విస్తృత పరచాలని అమెజాన్ సంస్థ భావిస్తోంది. డెలివరీ బాయ్స్ కు ఫిక్స్ డ్ సాలరీగా..ప్రతినెలా అమెజాన్ రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు అందిస్తోంది.

Read More : Spider-Scorpion Mix Bug : ఇదో రాకాసి పురుగు.. సగం తేలు.. సగం సాలీడు!

అయితే..డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు నెలలో రోజుకు 4 గంటలు పనిచేస్తే..సుమారు రూ. 55 వేల నుంచి రూ. 60 వేల వరకు వస్తాయని అమెజాన్ వెల్లడిస్తోంది. ఒక ప్యాకేజీ డెలివరీ చేస్తే..సుమారు రూ. 10 నుంచి రూ. 15 కమిషన్ వస్తుంది. ఇలా ఒక్క రోజులో 100 నుంచి 150 ప్యాకేజీలను కస్టమర్లకు డెలివరీ చేస్తే…నెలకు గరిష్టంగా రూ. 60 వేలను పొందే అవకాశం ఉందని తెలిపింది. అయితే..ప్యాకేజీల డెలివరీ దూరం విషయంలో స్పష్టత ఇచ్చింది. కంపెనీ ప్రకారం..ప్యాకేజీల డెలివరీ 10 కిలోమీటర్ల నుంచి 15 కి.మీటర్ల దూరంలో ఉంటుందని తెలిపింది. ప్యాకేజీలను సుమారు నాలుగు నుంచి ఐదు గంటల్లో డెలివరీ చేసే అవకాశం ఉందని అమెజాన్ వెల్లడిస్తోంది.

Read More : Pimpri-Chinchwad Police : బ్యాంకు అకౌంట్ హ్యాక్..రూ. 38 లక్షలు మాయం