ఢిల్లీలో భూకంపం

  • Published By: venkaiahnaidu ,Published On : April 12, 2020 / 12:37 PM IST
ఢిల్లీలో భూకంపం

న్యూఢిల్లీ-NCR(నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో ఆదివారం(ఏప్రిల్-12,2020)సాయంత్రం 5:45గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఢిల్లీ,నోయిడా,ఘజియాబాద్ లో 3-4సెకండ్ల పాటు భూకంపం వచ్చింది. తూర్పు ఢిల్లీలో…ఎపిసెంటర్(భూకంప కేంద్రం) గుర్తించబడింది.

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. ఢిల్లీ,నోయిడా,ఘజియాబాద్ లో 3-4సెకండ్ల పాటు భూమి కంపించింది. అయితే భూకంపం కారణంగా ఏర్పడిన నష్టం గురించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఢిల్లీలో భూకంపంపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ప్రతిఒక్కరూ సేఫ్ గా ఉన్నట్లు ఆశిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరి రక్షణ కోసం తాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
 

మరోవైపు ఢిల్లీలో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశముందని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్(IMD)అంచనావేసింది. కాగా,ఆదివారం(ఏప్రిల్-12)జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం ఒక గీత పెరిగి “మితమైన(మోడరేట్)”కేటగిరీలో నిలిచింది. ఢిల్లీలో గత వారం,ఎయిర్ క్వాలిటీ “గుడ్”కేటగిరీలో ఉన్న విషయం తెలిసిందే.

అయితే కరోనా చీకట్లను జయించేందుకు ఏప్రిల్-5న దేశప్రజలందరూ దీపాలు వెలిగించాలని ప్రధాని మోడీ విజ్ణప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు మూర్ఖులు దీపాలు వెలిగించడానికి బదులుగా క్రాకర్స్ కాల్చారు. టపాసులు పేల్చారు. ఈ పిచ్చి పనితో తగ్గిన ఎయిర్ పొల్యూషన్ కాస్తా మళ్లీ పెరగడానికి కారణమైంది.