హిమాచల్ ప్రదేశ్‌ లో భూకంపం

  • Published By: veegamteam ,Published On : May 3, 2019 / 05:43 AM IST
హిమాచల్ ప్రదేశ్‌ లో భూకంపం

హిమాచల్ ప్రదేశ్‌‌ లో భూకంపం సంభవించింది. శుక్రవారం (మే 3, 2013) ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా వణికిపోయారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై  4.2గా నమోదైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 

మండికి ఈశాన్యంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్టు సిమ్లా వాతావరణ కేంద్ర డైరెక్టర్ మన్మోహన్ సింఘ్ తెలిపారు. తెల్లవారుజామున 4.32 సమయంలో మండి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని తెలిపారు.

మండి పరిధిలోని పలు ప్రాంతాలలో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. మండితో సహా హిమాచల్ ప్రదేశ్‌లోని అధికభాగం భూకంప తీవ్రతగల జోన్‌లో ఉంది. దీంతో ఈ ప్రాంతంలో తరచూ స్వల్ప ప్రకంపనలు సంభవిస్తున్నట్టు అధికారులు తెలిపారు.