Earthquake : బీహార్, పశ్చిమ బెంగాల్ లో భూకంపం

బుధవారం తెల్లవారుజాము 5.35 గంటలకు బీహార్ లోని అరారియాలో భూప్రకంపణలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ పేర్కొంది.

Earthquake : బీహార్, పశ్చిమ బెంగాల్ లో భూకంపం

Earthquake (1)

Earthquake : వరుస భూకంపాలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలో గత కొంతకాలంగా అనునిత్యం ఎక్కడో ఒకచోట భూకంపం సంభవిస్తూనే ఉంది. తాజాగా బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది. బుధవారం తెల్లవారుజాము 5.35 గంటలకు బీహార్ లోని అరారియాలో భూప్రకంపణలు చోటు చేసుకున్నాయి.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ పేర్కొంది. పూర్నియాకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు సంభవించాయని వెల్లడించింది. అయితే, భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియలేదని అధికారులు పేర్కొన్నారు.

Earthquakes : అండమాన్‌లో 24 గంటల్లో మూడుసార్లు భూకంపం..

పశ్చిమ బెంగాల్ లో కూడా భూకంపం వచ్చిందని ఎన్ సీఎస్ వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున 5.35 గంటలకు సిలిగురిలో భూప్రకంపనలు సంభవించాయని తెలిపింది. సిలిగురికి 140 కిలో మీటర్ల దూరంలో భూకంపం ఉన్నట్లు గుర్తించారు.