Earthquake In Delhi, Haryana : ఢిల్లీ, హర్యానాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదు

ఢిల్లీ, హర్యానాలో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. గురుగామ్, హర్యానాలోని శెరియా, ఝజ్జర్, ఢిల్లోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది.

Earthquake In Delhi, Haryana : ఢిల్లీ, హర్యానాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదు

Earthquake

Earthquake in Delhi : ఢిల్లీ, హర్యానాలో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. గురుగామ్, హర్యానాలోని శెరియా, ఝజ్జర్, ఢిల్లోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదు అయినట్లు వెల్లడించింది. భయంతో జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అందించిన సమాచారం ప్రకారం ఆదివారం(జనవరి1,2023) అర్ధరాత్రి 1.19 గంటలకు హర్యానాలోని ఝజ్జర్ వాయువ్య ప్రాంతంలో భూకంపం సంభవించింది.

Earthquake In Uttarakhand : ఉత్తరాఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.1గా నమోదు

భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదు అయింది. దీంతో ఢిల్లీ-ఎన్ సీఆర్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.