2020 ఎండింగ్ ఎఫెక్టేనా? దేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపాలు

2020 ఎండింగ్ ఎఫెక్టేనా? దేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపాలు

Earthquakes Hits Alwar Tremors : కరోనాతో కంటి మీద కునుకులేకుండా ఏడాది మొత్తం గడిపిన భారత ప్రజలకు ఇయర్ ఎండింగ్‌లో మరో కొత్త రూపంలో ఇబ్బందులు తలెత్తడం ఇప్పుడు ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఏడాది ఆరంభంలోనే దేశంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లోకి కరోనా ప్రవేశించగా.. తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజానికానికి దెబ్బ మీద దెబ్బలా ఉత్తారాది రాష్ట్రాల్లో భూప్రకం‌ప‌నలు సంభ‌విం‌చాయి.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గురువారం(17 డిసెంబర్ 2020) రాత్రి 11.45 గంటలకు ప్రకంపనలు సంభవించగా.. ప్రజలు భయపడి ఇళ్ళ నుండి బయటకు వచ్చారు. రిక్టర్ స్కేల్ వద్ద భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. ఢిల్లీ నుంచి గురుగ్రామ్‌లోని నోయిడా ఘజియాబాద్ వరకు ప్రకంపనలు సంభవించగా.. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(ఎన్‌సిఎస్) ప్రకారం, భూకంప కేంద్రం రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఢిల్లీ NCR ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.

రాజస్థాన్‌లోని అల్వార్‌లో కూడా భూకంప కేంద్రం ఉందని, భూమికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. ఢిల్లీ రాజధాని ప్రాంతం పరిధిలో ఉన్న గురుగ్రామ్‌, ఘజియాబాద్‌, నోయిడాలో ఈ ప్రకంపనలు కనించాయి. ఆస్తి, ప్రాణ నష్టం సంభ‌వించ‌నప్పటికీ, భూకంపకేంద్రం తక్కువ దూరంలో ఉండడంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నెల ప్రారంభం నుంచి గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 1.7 నుంచి 3.3 తీవ్రత పరిధిలో 19 భూకంపాలు సంభవించాయి. వీటి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదు. ప్రపంచంలో భూకంపం విషయానికి వస్తే.. జపాన్‌లో బలమైన షాక్‌లు తగులుతున్నాయి. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, జపాన్‌లో గురువారం 4.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం రాజధాని టోక్యోకు ఉత్తరాన ఇబారకి ప్రావిన్స్‌లో ఉంది. అయితే సునామీ హెచ్చరిక జారీ కాలేదు.

కరోనాతో అల్లాడిపోతున్న జనం ఈ భూకంపాల ప్రభావాన్ని సోషల్ మీడియా వేదికగా.. 2020 ఇయర్ ఎండింగ్ ఎఫెక్టేనా? అని అంటున్నారు.