Earthquake: జార్ఖండ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.1గా నమోదు

జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదైంది.

Earthquake: జార్ఖండ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.1గా నమోదు

Earthqakes (1)

Earthquake: జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం, ఆదివారం మధ్యాహ్నం 2:22 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపం సమయంలో చిన్నపాటి కదలికలే కానీ, ప్రమాదం ఏమీ జరగలేదని అధికారులు చెబుతున్నారు.

అస్సాంలోని తేజ్‌పూర్‌లో కూడా భూమి కంపించినట్లుగా అధాకారులు వెల్లడించారు. తేజ్‌పూర్‌లో 2.40 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లుగా చెబుతున్నారు. స్సాంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8 గా నమోదవగా.. ఇది చాలా స్వల్పమైనదని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

భూకంపం సంభవిస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలు:
ఇంట్లో ఉంటే కచ్చితంగా బయటకు రావాలి.
బయటకు వచ్చిన తర్వాత భవనాలు, చెట్లు, స్తంభాలు మరియు వైర్‌లకు దూరంగా ఉండాలి.
వాహనంలో ప్రయాణిస్తుంటే, వీలైనంత త్వరగా వాహనాన్ని ఆపుకోవాలి.
అగ్గిపుల్ల వెలిగించవద్దు.. శబ్దం చేయరాదు.

భూకంపం ఎందుకు వస్తుంది?
భూమి ప్రధానంగా నాలుగు పొరలతో రూపొందించబడింది. సాలిడ్ కోర్, లిక్విడ్ కోర్, మాంటిల్ మరియు క్రస్ట్. క్రస్ట్‌కు సంబంధించిన ఎగువ మాంటిల్ కోర్‌ను లిథోస్పియర్ అంటారు. ఈ 50 కి.మీ మందపాటి పొర అనేక విభాగాలుగా విభజించబడింది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అంటారు. ఈ టెక్టోనిక్ ప్లేట్లు వాటి స్థానాల్లో కదులుతూ ఉంటాయి. ఈ ప్లేట్ ఎక్కువగా కదలడం ప్రారంభించినప్పుడు భూకంపం సంభవిస్తుంది. ఈ ప్లేట్లు వాటి ప్రదేశం నుండి అడ్డంగా మరియు నిలువుగా కదులుతూ ఉంటాయి. భూకంప తీవ్రత భూకంప కేంద్రం నుంచి వెలువడే శక్తి తరంగాల ద్వారా అంచనా వేస్తారు.