గుజరాత్‌లో భూకంపం.. తీవ్రత 5.5గా నమోదు

  • Published By: vamsi ,Published On : June 15, 2020 / 01:51 AM IST
గుజరాత్‌లో భూకంపం.. తీవ్రత 5.5గా నమోదు

కరోనా విపత్తుతో ప్రజలు కకావికలం అవుతుంటే.. మరో వైపు, తరచూ వస్తున్న భూకంపాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. లేటెస్ట్‌గా గుజరాత్‌లో భూకంపం సంభవించగా.. అక్కడి ప్రజలలో భయాందోళన వాతావరణం కనిపించింది. 

భూకంప కేంద్రం రాజ్‌కోట్‌కు వాయువ్యంగా 122 కిలోమీటర్లు దూరంలో ఉందని, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌లో 5.5గా నమోదైనట్లుగా అంచనా.. రాత్రి 8గంటల 13నిమిషాలకు భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రాణనష్టం అయితే ఏమీ కాలేదు. 

అంతకుముందు జూన్ 2 న ఉదయం 8.15 గంటలకు కాశ్మీర్‌లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.9 గా కొలుస్తారు. ఈ భూకంపం కేంద్రం శ్రీనగర్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.