mahatma gandhi ఆరోగ్య సూత్రాలు : మనో బలాఢ్యుడు

  • Published By: madhu ,Published On : October 2, 2020 / 08:25 AM IST
mahatma gandhi ఆరోగ్య సూత్రాలు : మనో బలాఢ్యుడు

mahatma gandhi : అహింస ఆయుధంగా భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయుడు మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ. 2020, అక్టోబర్ 02వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆయన విగ్రహాలకు నివాళులర్పిస్తున్నారు. బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసి దేశానికి స్వతంత్ర ఫలాలు తీసుకొచ్చారు జాతిపిత మహాత్మాగాంధీ.



పట్టుదల, సంకల్పం, అహింస మార్గాలను అనుసరించారు. ఆరోగ్యకరమైన, సాధారణ జీవితాన్ని గడిపారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 02వ తేదీ గాంధీ జయంతి. ఈ సందర్భంగా ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.
ఇక్కడ చెప్పుకోవాల్సిందే ఏమిటంటే..మహాత్మాగాంధీ శారీరకంగా దుర్బ లుడు, మానసికంగా బలంగా ఉండేవారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే వారు గాంధీజీ.



సాత్వికమైన ఆహారాన్ని తీసుకునే వారని పలువురు వెల్లడిస్తుంటారు. ఈయన శాకాహారి. మితాహారి. తక్కువగా మాట్లాడేవారు. కేవలం ఆయన బరువు 46.7 కిలోల బరువు ఉండేదంట. తృణ ధాన్యాలు, వరి, జొన్న, రాగులు వంటివి కూడా శరీరానికి బలం ఇస్తాయని గాంధీజీ నమ్మేవారు. కూరగాయలు ఆయన ఆహారంలో ప్రధానభాగం.



ఈయన తొలుత పాల పదార్థాలకు దూరంగా ఉండేవారు. కేవలం ఒక వెజిటేరియన్‌గానే ఉండాలని కోరుకొనేవారు. కానీ కాలక్రమేణా..ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నారు. ఓ వైద్యుడి సలహా మేరకు మేక పాలను తన డైట్‌లో భాగంగా చేసుకున్నారు. అతని డైట్‌లో ఒక లీటరు మేక పాలు, 150 గ్రాముల చిరుధాన్యాలు, 75 గ్రాముల ఆకుకూరలు, 125 గ్రాముల కాయగూరలు, 25 గ్రాముల సలాడ్లు, 40 గ్రాముల నెయ్యి, 40 గ్రాముల పంచదార ఉండేటట్లు చూసుకున్నారు.



ఇక ఆరోగ్యంతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండాలని అనేవారు. ఇందుకు ధ్యానం చేయాలంటున్నారు. ప్రతి రోజు ధ్యానం చేయాలని సూచిస్తుంటారు. వేగంగా నిద్రపోవడం, వేగంగా నిద్రలేవడం అలవాటు చేసుకున్నారు. సూర్యోదయానికి ముందు నిద్రలేచి ధ్యానం చేయడం వల్ల శరీరంలో ఉత్తేజం వస్తుందంటారు. వేగంగా నడిచే వారు. నడక వలన ఎన్నో ఉపయోగాలున్నాయి.



గుండె బలహీనతను తగ్గించుకోవడం, కొవ్వు కరిగించుకోవడం, పక్కటెముకలు పటిష్టపడుతాయి. ప్రతీ వ్యక్తి రోజుకు ఎంతోకొంత దూరం నడవడం తప్పనిసరిగా భావించాలి.