EC Announces Schedule Bypolls: ఒక పార్లమెంట్, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ శనివారం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ షెడ్యూల ప్రకారం.. డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న కౌంటింగ్ జరగనుంది.

EC Announces Schedule Bypolls: ఒక పార్లమెంట్, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..

Election Commission of India

EC Announces Schedule Bypolls: ఐదు రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందుకుగాను నవంబర్ 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. డిసెంబర్ 5న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్ జరగనుంది.

Munugode By-Election : రేపే మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఐదు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో ఉప ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఒడిశాలోని పదంపూర్, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్, బీహార్‌లోని కుర్హానీ, ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్, యూపీలో రాంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు మెయిన్‌పురి పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి (ఉత్తరప్రదేశ్) పార్లమెంట్ స్థానం ఖాళీ అయింది. ఈ ఉఫ ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇదిలాఉంటే నవంబర్ 10న నోటిఫికేషన్ గెజిట్ విడుదల కానుండగా, ఉప ఎన్నికలకు నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 17 తేదీన, నామినేషన్ల పరిశీలన నవంబర్ 18న, ఉపసంహరణకు నవంబర్ 21 చివరి తేదీని ఈసీ ప్రకటించింది. డిసెంబర్ 5న పోలింగ్, డిసెంబర్ 8న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.