కర్నాటకలో EC దూకుడు : యడ్యూరప్ప లగేజ్ తనిఖీ

కర్ణాటక రాష్ట్రంలో EC దూకుడు పెంచుతోంది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తుండడంతో నేతలు టెన్షన్ పడుతున్నారు.

  • Published By: madhu ,Published On : April 16, 2019 / 08:53 AM IST
కర్నాటకలో EC దూకుడు : యడ్యూరప్ప లగేజ్ తనిఖీ

కర్ణాటక రాష్ట్రంలో EC దూకుడు పెంచుతోంది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తుండడంతో నేతలు టెన్షన్ పడుతున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో EC దూకుడు పెంచుతోంది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తుండడంతో నేతలు టెన్షన్ పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఈసీ అధికారులు సోదాలు జరిపారు. ఆయన బ్యాగుల్లో ఏమున్నాయని క్షుణ్ణంగా సెర్చ్ చేశారు. యడ్యూరప్ప బ్యాగుల్లో ఎలాంటి నగదు..లభ్యం కాలేదని తెలుస్తోంది. తనిఖీలపై ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్

కర్నాటక రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు జరుగన్నాయి. మొదటి విడతలో ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది. పార్టీల నేతలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో భారీగా డబ్బు ప్రభావం ఉంటుందని ఎన్నికల అధికారులు భావించారు. అందులో భాగంగా ఈసీ, ఎన్నికల అధికారులు విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. 

క‌ర్నాట‌క‌లో ప్రధాన మంత్రి మోడీ ప్ర‌యాణించిన హెలికాప్ట‌ర్ నుంచి ఓ న‌ల్ల‌టి ట్రంకు పెట్టెని తీసుకెళ్లినట్లు…ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. పెట్టెలో డ‌బ్బులు త‌ర‌లించార‌ని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రచారానికి వెళుతున్న సమయంలో యడ్యూరప్ప హెలికాప్టర్‌ను తనిఖీలు చేయడం కలకలం రేపుతోంది. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు, యడ్యూరప్ప అనుచురులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో కర్నాటకలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల, ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నాయి. 
Read Also : మరలా బాబే సీఎం : YCP అరాచకాన్ని అణిచివేస్తాం – బుద్ధా