మళ్లీ అలా మాట్లాడవద్దు : మేనకాగాంధీకి ఈసీ వార్నింగ్

మళ్లీ అలా మాట్లాడవద్దు : మేనకాగాంధీకి ఈసీ వార్నింగ్

కేంద్ర మంత్రి మేన‌కా గాంధీకి సోమవారం(ఏప్రిల్-29,2019) ఎలక్షన్ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది.తమ పార్టీకి ఓటర్లు ఓటు వేసే విధానం ద్వారా  గ్రామాల‌ను ఏ,బీ,సీ,డీ కేట‌గిరీలు విభ‌జించి అభివృద్ధి ప‌నులు చేప‌డుతామ‌ని ఏప్రిల్-14,2019న ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మేన‌కా గాంధీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు వ‌చ్చిన గ్రామాల్లో ముందుగా అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌నున్నట్లు ఆమె చెప్పారు.

మేనకా చేసిన వ్యాఖ్య‌ల‌పై ఈసీ సీరియ‌స్ అయ్యింది.అభివృద్ధి ప‌నుల కామెంట్‌ ను ఈసీ తీవ్రంగా ఖండించింది.మేనకా గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి,ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లను ఉల్లంఘించిందని ఈసీ తెలిపింది. అలాంటి వ్యాఖ్య‌లు మ‌ళ్లీ రిపీట్ చేయ‌వద్ద మేనకాగాంధీకి ఈసీ వార్నింగ్ ఇచ్చింది. యూపీలోని సుల్తాన్‌ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మేన‌కా గాంధీ పోటీ చేస్తున్నారు.

ఏప్రిల్-15,2019న సుల్తాన్ పూర్ లో ముస్లిం ఓటర్లను ఉద్దేశించి మేనకా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో 48గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఈసీ ఆమెపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.