‘సివిజిల్’ యాప్ :ఎల‌క్ష‌న్ కంప్ల‌యింట్స్ ఎవ‌రైనా చేయొచ్చు

ఈసారి లోక్ సభ ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ, నేతలు ఎంసీసీ కోడ్ ను ఉల్లంఘించకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ ఓ కొత్త మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది.  

  • Published By: sreehari ,Published On : March 11, 2019 / 01:09 PM IST
‘సివిజిల్’ యాప్ :ఎల‌క్ష‌న్ కంప్ల‌యింట్స్ ఎవ‌రైనా చేయొచ్చు

ఈసారి లోక్ సభ ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ, నేతలు ఎంసీసీ కోడ్ ను ఉల్లంఘించకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ ఓ కొత్త మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది.  

ఎన్నికలు సమీపిస్తున్నాయి.. కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) 2019 లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. ఎన్నికల కోడ్ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) కూడా అమల్లోకి వచ్చేసింది. ఎన్నికల కోడ్ నియమావళికి అనుగుణంగానే అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఫాలో అవ్వాల్సిందే. సాధారణంగా ఎన్నికల వేళ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కొన్నిసార్లు రాజకీయ పార్టీలు, నేతలు మోడల్ కోడ్ ను ఉల్లంఘించిన సందర్భాలు అనేకం. ఇకపై అలా కుదరదు. ఈసీ అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా.. కోడ్ ఉల్లంఘనకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అందులోభాగంగానే .. ఈసారి లోక్ సభ ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ, నేతలు ఎంసీసీ కోడ్ ను ఉల్లంఘించకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ ఓ కొత్త మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది.  
Read Also : ఆ సర్వేలో చెప్పిన జనం : మళ్లీ మోడీనే ప్రధాని కావాలి

అదే.. ‘cVIGIL’ మొబైల్ యాప్. అంటే.. సిటిజన్స్ విజిల్ అని అర్థం. పాన్-ఇండియా లెవల్ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. 2018లోనే ఈ యాప్ ను లాంచ్ చేసినప్పటికీ.. ఇప్పటివరకూ టెస్టింగ్ దశలో కొనసాగింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో టెస్టింగ్ మోడ్ లో పెట్టారు. ఎవరైనా మోడల్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే.. ఈ యాప్ ద్వారా రికార్డు చేసి సంబంధిత ఎన్నికల అధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఈ యాప్ పనితీరుపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా మాట్లాడుతూ.. సిటిజన్స్ ఎవరైనా సరే తమ ఆండ్రాయిడ్ మొబైల్లో ‘cVIGIL’యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్టు గుర్తిస్తే వెంటనే ఈ యాప్ ద్వారా రికార్డు చేసి క్షణాల్లో ఈసీకి పంపవచ్చు. ఇందుకు మీరు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లాల్సిన పనిలేదు. ఈ యాప్ నుంచే ఫిర్యాదు చేయొచ్చు’ అని చెప్పారు. 

ఎలా పనిచేస్తుందంటే..
సిటిజన్స్ విజిల్ యాప్ ఓపెన్ చేసి.. ఫొటో లేదా రెండు నిమిషాల నిడివి గల వీడియోను రికార్డు చేయొచ్చు. ఎవరైనా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్టు గుర్తిస్తే.. వెంటనే ఫొటో లేదా వీడియోను రికార్డు చేసి ఈసీకి పంపొచ్చు. ఈ యాప్ లో లోకేషన్ సర్వీసు ఆధారంగా కోడ్ ఉల్లంఘించిన ప్రాంతాన్ని ఆటోమాటిక్ గా పిన్ పాయింట్ చేస్తుంది. ఫొటో లేదా వీడియోను యాప్ ద్వారా పంపగానే.. ఓ యూనిక్ ఐడీ వస్తుంది. సదరు యూజర్.. తన మొబైల్ డివైజ్ నుంచి లొకేషన్ ట్రాక్ చేయొచ్చు.. యాప్ అప్ డేట్స్ పొందొచ్చు. ఎన్ని కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులైన యాప్ ద్వారా పంపొచ్చు.
Read Also : చంద్రబాబు కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే: జగన్

ఈ యాప్ ను రాజకీయంగా విపక్షాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని పొలిటికల్ పార్టీలు దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ యాప్..  ప్రీ రికార్డెడ్ వీడియోలు, పాత ఫొటోలను అప్ లోడ్ చేసేందుకు అనుమతించదు. ఇందులో వీడియో లేదా ఫొటోను రికార్డు చేయగానే.. యాప్ పై ఓ విండో ఓపెన్ అవుతుంది. అది 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇలోగా సిటిజన్ తమ ఫిర్యాదును పంపాల్సి ఉంటుంది. 

మార్చి 10, 2019 రోజున ఎన్నికల కమిషన్ 17వ లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు ఏడు దశల్లో జరుగనున్నాయి. ఏప్రిల్ 11 నుంచి తొలి విడత పోలింగ్ మొదలు కానుంది. మే 23న ఓట్ల లెక్కింపు జరుగనుంది. 16వ లోక్ సభ ఐదేళ్ల కాల పరిమితి 2019 జూన్ 3తో ముగియనుంది. 
Read Also : లైటింగ్ ఎఫెక్ట్ : ఎయిర్‌పోర్ట్‌ తరహాలో వ‌ర‌ల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్లు