ఎకానమీ ఇబ్బందుల్లో లేదు…గ్రీన్ షూట్స్ కన్పిస్తున్నాయి

  • Published By: venkaiahnaidu ,Published On : February 11, 2020 / 01:21 PM IST
ఎకానమీ ఇబ్బందుల్లో లేదు…గ్రీన్ షూట్స్ కన్పిస్తున్నాయి

 ఎకానీమీ ఇబ్బందుల్లో లేదని, 5బిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ దిశగా భారత్ వెళ్తున్నట్లు దేశంలో గ్రీన్ షూట్స్(ఆర్థికవ్యవస్థ వృద్ధి సంకేతాలు)కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ఎకానమీ మెరుగుదల కోసం ఎన్డీయే సర్కార్ తీసుకున్న పలు ఇనిషియేటివ్స్ ఆమె ప్రస్తావించారు. ఫ్యాక్టరీ ఔట్ పుట్ లో పెరగుదల,ఎఫ్ డీఐల పెరుగుదల, గడిచిన మూడేళ్లలో 1లక్ష కోట్లకుపైగా జీడీపీ వసూళ్లు వంటివి ఆర్థికవ్యవస్థలో గ్రీన్ షూట్స్ సంకేతాలని నిర్మలా సీతారామన్ అన్నారు.

ఏడు ముఖ్యమైన సూచనలు….ఎకానమీలో గ్రీన్ షూట్స్ ఉన్నట్లు సూచిస్తున్నాయని,ఎకానమీ ఇబ్బందుల్లో లేదని లోక్ సభలో బడ్జెట్ పై జరిగిన డిబేట్ లో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. విదేశీ మారక నిల్వలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కువగా ఉన్నాయని,స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా ఉందని ఆమె అన్నారు. వృద్ధి యొక్క నాలుగు ఇంజిన్స్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని,అందులో పెట్టుబడులు,ఎగుమతులు,ప్రైవేటు అండ్ పబ్లిక్ వినియోగం ఉన్నాయని ఆర్థికమంత్రి చెప్పారు.

పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్స్ కు సంబంధించి నిర్మలా మాట్లాడుతూ…గతేడాది డిసెంబర్ లో కేంద్రప్రభుత్వం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైప్ లైన్ ప్రాజెక్టు గురించి ప్రకటించిందని, రాబోయే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఇది 1.03లక్షల కోట్లను సేకరిస్తుందన్నారు. వినియోగానికి ఊతం ఇచ్చేందుకు 2019-20లో రబీ,కరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్లు తెలిపారు.

యూపీఏ హయాంలోనే ద్రవ్యలోటు ఎక్కువగా ఉండిందని ఆర్థికమంత్రి తెలిపారు. ఎకానమీని సమర్థవంతులైన డాక్టర్లు మేనేజ్ చేసినప్పడే అలాంటి పరిస్థితి ఉండినట్లు పరోక్షంగా మాజీ ఆర్థికమంత్రి చిదంబరం సోమవారం చేసిన వ్యాఖ్యలకుయ కౌంటర్ ఇచ్చారు. ఎకానీమీ దాదాపు కుప్పకూలే పరిస్థితికి వచ్చిందని,ఎకానమీని అసమర్థ డాక్టర్లు మేనేజ్ చేస్తున్నారంటూ పరోక్షంగా నిర్మలా సీతారామన్ పై సోమవారం మాజీ ఆర్థికమంత్రి చిదంబరం సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.