డీకేకు బెయిల్ పై సుప్రీంకు ఈడీ

  • Published By: chvmurthy ,Published On : October 25, 2019 / 10:09 AM IST
డీకేకు బెయిల్ పై సుప్రీంకు ఈడీ

మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన కర్ణాటకకు చెందిన  సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కి ఢిల్లీ హై కోర్టు అక్టోబరు23న బెయిల్ మంజూరు చేయటంపై ఎన్ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ సుప్రీం కోర్టును  ఆశ్రయించనుంది. డీకే శివకుమార్ సాక్ష్యాలను తారుమారు చేస్తారని, లేదా దేశం విడిచి పెట్టి  వెళ్లిపోతారని అనేందుకు ఎలాంటి ఆధారాలు  లేవని ఆయనకు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కైత్ వ్యాఖ్యానించారు. 

కీలక పత్రాలు అన్నీ దర్యాప్తు సంస్ధల దగ్గర ఉన్నందున డీకే సాక్ష్యాలను తారుమారు చేయలేరని కోర్టు అభిప్రాయ పడింది. రూ.25లక్షల వ్యక్తిగత  పూచికత్తుపై అదే మొత్తానికి ఇద్దరు వ్యక్తులు ష్యూరిటీ పై డీకే శివకుమార్ ను విడుదల చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

డీకే కు బెయిల్ రావటంతో ఆయన మద్దతు దారులు శుక్రవారం  శివమొగ్గలోని రామన్న శ్రేష్టి పార్క్ గణేశ ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టారు.