Nitesh Rana Resigns: ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేశ్ రాణా రాజీనామా.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక మలుపు ..!

ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీశ్ రాణా తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 2015 నుండి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాణా అనేక ఉన్నత స్థాయి కేసుల్లో ఫెడరల్ ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించారు.

Nitesh Rana Resigns: ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేశ్ రాణా రాజీనామా.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక మలుపు ..!

ED Public Prosecutor Nitesh Rana

Nitesh Rana Resigns: ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేశ్ రాణా తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 2015 నుండి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాణా అనేక ఉన్నత స్థాయి కేసుల్లో ఫెడరల్ ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాంతో పాటు, లాలూ ప్రసాద్ యాదవ్ ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం, జార్ఖండ్ మైనింగ్ స్కాంల కోర్టు వ్యవహారాలను నితేశ్ రాణా పర్యవేక్షణ చేస్తున్నారు. తన రాజీనామా వెనుక, తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఈడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం విధితమే. శనివారమే ఎమ్మెల్సీ కవితనుసైతం ఈడీ అధికారులు విచారించారు. ఇలాంటి పరిస్థితుల్లో నితేశ్ రాణా రాజీనామా వ్యవహారం హాట్ టాఫిక్ గా మారింది.

Delhi Liquor Case: కవితను ప్రశ్నిస్తున్న ఈడీ.. ఆఫీసు దగ్గర టెన్షన్ టెన్షన్

ఈడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా 2015 నుంచి రాణా అనేక కేసుల విచారణలో భాగస్వామిగా ఉన్నారు. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం, కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్, టీఎంసీ అభిషేక్ బెనర్జీ, సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఇలా అనేక హై ప్రొఫైల్ కేసులలో ఈడీ తరపున నితేశ్ రాణా ప్రాతినిధ్యం వహించారు. ఎల్‌ఇటి, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు వ్యతిరేకంగా జమ్మూకాశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో, ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్‌లపై కేసులలో ఈడీ తరపున నితేశ్ రాణా ప్రాతినిధ్యం వహించారు.

Delhi Liquor Scam : కవితను జైల్లో వేయాలంటే ఈడీకి ఇంత టైమా?పేరంటానికి పిలిచారా?ఇదంతా బీఆర్ఎస్,బీజేపీ డ్రామాలు : రేవంత్ రెడ్డి

ఎయిరిండియా “స్కామ్”, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలపై మనీలాండరింగ్ కేసులు, రాన్‌బాక్సీ-రెలిగేర్ మోసం, స్టెర్లింగ్ బయోటెక్ స్కామ్, పశ్చిమ బెంగాల్ పశువుల అక్రమ రవాణా కేసులో కూడా ఈడీ తరపున నితేశ్ రాణా ప్రాతినిధ్యం వహించారు. అంతేకాక, యునైటెడ్ కింగ్‌డమ్ కోర్టులో మనీలాండరింగ్ దర్యాప్తు సంబంధిత విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు నితేశ్ రాణా ప్రాతినిధ్యం వహించారు.