ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్న విద్యాశాఖ మంత్రి

  • Published By: madhu ,Published On : August 11, 2020 / 06:28 AM IST
ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్న విద్యాశాఖ మంత్రి

జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్ నాథ్ మహతో ఇంటర్ చదివేందుకు కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. పదో తరగతి చదువుకున్న ఆయనకు విద్యా శాఖ ఎలా కేటాయిస్తారు ? ఆయన విద్యా వ్యవస్థకు ఎలాంటి న్యాయం చేస్తారన ప్రతిపక్షాలు విమర్శలు చేసే వారు. దీంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు.



తాను విద్యా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఎంతో మంది విమర్శించారని, పదో తరగతి మంత్రి ఏం చేస్తాడని విమర్శలు చేశారని మంత్రి జగర్ నాథ్ మహతో వెల్లడించారు.

చదువుకొనేందుకు వయ్సస్సుతో సంబంధం లేదు..తన చదువును పూర్తి చేస్తా..అంటున్నారు ఈ 53 ఏళ్ల మంత్రి. ఇంటర్ చదివేందుకు బోకారో జిల్లాలోని దేవి మహోతో కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు.



తన శక్తి సామర్థ్యాలను పట్టించుకోకుండా..విద్యా అర్హతపై హేళన చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఇంటర్ కష్టపడి చదువు కుంటానన్నారు మంత్రి జగర్ నాథ్ మహతో. ఈయన 1995లో పదో తరగతి పాస్ అయ్యారు.