Foreign Vaccines : విదేశీ వ్యాక్సిన్ల కోసం పెద్ద స్థాయిలో ప్రయత్నా లు

విదేశీ తయారీ వ్యాక్సిన్లు ఫైజర్,మొడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ కూడా మనకి అందుబాటులోకి వస్తే..దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగవంతమవుతుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది.

Foreign Vaccines : విదేశీ వ్యాక్సిన్ల కోసం పెద్ద స్థాయిలో ప్రయత్నా లు

Vaccine

Foreign Vaccines విదేశీ తయారీ వ్యాక్సిన్లు ఫైజర్,మొడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ కూడా మనకి అందుబాటులోకి వస్తే..దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగవంతమవుతుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది. సుప్రీంకోర్టుకి సమర్పించిన 380 పేజీల అఫిడవిట్ లో కేంద్ర ప్రభుత్వం.. వ్యాక్సినేషన్ రోడ్ మ్యాప్ కి సంబంధించి కీలక విషయాలను పేర్కొంది. విదేశీ తయారీ వ్యాక్సిన్లను దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అత్యున్నత రాజకీయ కార్యనిర్వాహక స్థాయిలో మరియు అత్యున్నత దౌత్య స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్రం తన అఫిడవిట్ లో తెలిపింది.

ఈ ప్రయత్నాలు చాలా అధునాతన దశలో ఉన్నందున..సమగ్ర వివరాలను ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తెలిపింది. ఈ ప్రయత్నాలు కార్యరూపం దాల్చినప్పుడు, టీకా వేగం మరింత పెరుగుతుంది మరియు మెరుగుపరచబడుతుందని కేంద్రం తెలిపింది. కాగా,విదేశీ వ్యాక్సిన్ తయారీదారులతో ఒప్పందం ఖరారవుతున్నాయని..భారతదేశానికి వ్యాక్సిన్లను సరఫరా చేయడానికి ఫైజర్ సిద్ధంగా ఉందని ఇదివరకే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ తో వ్యాక్సిన్ డీల్ తర్వలోనే ఫైనల్ అవుతుందని ఇటీవల ఫైజర్ సీఈవో డాక్టర్ అల్బర్ట్ బౌర్లా తెలిపారు. అయితే ఈ ఏడాది..భారతదేశానికి వ్యాక్సిన్లను సరఫరా చేయలేమని మోడెర్నా ఇప్పటికే స్పష్టం చేసింది.

విదేశీ వ్యాక్సిన్ల కోసం మోదీ సర్కార్ ఇప్పటికే నిబంధనలను సవరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే WHO మరియు ఇతర దేశాల రెగ్యులేటర్స్ ఆమోదం పొందిన వ్యాక్సిన్లకు స్థానిక క్లినికల్ ట్రయల్ లేకుండా భారతదేశంలో అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇవ్వాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ముందస్తు అనుమతి ట్రయిల్ కి బదులుగా, ప్రభుత్వం ఆమోదం అనంతర సమాంతర బ్రిడ్జింగ్ క్లినికల్ ట్రయల్ కోసం నిబంధన చేసింది ప్రభుత్వం. అయితే విదేశీ వ్యాక్సిన్ తయరీ సంస్థలు..లీగల్ ప్రొటెక్షన్ కోరుతుండగా,దేశీయ వ్యాక్సీన్ తయారీ సంస్థలు కూడా తమ కూడా అదే రక్షణ కావాలని పట్టుబడుతున్న నేపథ్యంలో విదేశీ సంస్థలతో ఒప్పందాలు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.