S Jaishankar: ఐరాసలో హిందీకి అధికార భాష హోదా కోసం ప్రయత్నిస్తున్నాం: ఎస్ జైశంకర్

హిందీ భాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో హిందీ భాషను అధికార భాషగా గుర్తించాలని కోరింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.

S Jaishankar: ఐరాసలో హిందీకి అధికార భాష హోదా కోసం ప్రయత్నిస్తున్నాం: ఎస్ జైశంకర్

S Jaishankar: ఐక్యరాజ్య సమితిలో హిందీకి అధికార భాష హోదా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్. ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించామని, అయితే ఇది సాధించడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.

Elon Musk: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్.. సీఈవో పరాగ్ అగర్వాల్ తొలగింపు

గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హిందీ భాషను యునెస్కోలో కూడా ఉపయోగిస్తున్నారని చెప్పారు. ‘‘హిందీ భాషను యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఉపయోగించేలా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. దీని ప్రకారం ఈ భాషను సోషల్ మీడియాలో కూడా వాడుతారు. అలాగే ఉత్తర ప్రత్యుత్తరాల్లో వినియోగిస్తారు. హిందీ భాష పరిధి విస్తరించేందుకు, ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టేందుకు మరికొంత సమయం పడుతుంది. ఒక భాషను ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టడం చాలా కష్టమైన వ్యవహారం. దీనికి భారీ ప్రక్రియ ఉంటుంది. దీనికి సంబంధించిన పని కొనసాగుతోంది’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు.

Caught On Camera: ఏడో తరగతి విద్యార్థినిపై బస్సు డ్రైవర్ దాడి.. వీడియోలో రికార్డైన ఘటన.. డ్రైవర్‌ను సస్పెండ్ చేసిన యాజమాన్యం

ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితి ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, చైనీస్, అరబిక్, ఫ్రెంచ్ భాషలను మాత్రమే అధికారిక భాషగా గుర్తించింది. మరో మంత్రి వి.మురళీధరన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది 12వ ప్రపంచ హిందీ మహాసభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఫిజీలో, అక్కడి ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15-17 వరకు ఈ సభ జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు సంబంధించిన లోగోను రూపొందించే పోటీ నిర్వహిస్తున్నారు. దీనికి 1,436 ఎంట్రీలు వచ్చాయి.