Republic Day parade: భారత గణతంత్ర వేడుకల్లో ఈజిప్ట్ ఆర్మీ.. తొలిసారి పరేడ్ నిర్వహించిన సైన్యం

ఢిల్లీలో జరిగిన 74వ గణతంత్ర వేడుకల్లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అలాగే ఈజిప్టు సైన్యం కూడా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈజిప్ట్ సైన్యం ఈ వేడుకల్లో మార్చ్ నిర్వహించింది. కల్నల్ మొహమూద్ మొహమ్మద్ ఫత్తా ఎల్ ఖరాసావి ఆధ్వర్యంలోని 144 మంది ఈజిప్టు సైనికులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు.

Republic Day parade: భారత గణతంత్ర వేడుకల్లో ఈజిప్ట్ ఆర్మీ.. తొలిసారి పరేడ్ నిర్వహించిన సైన్యం

Republic Day parade: చరిత్రలో తొలిసారిగా భారత దేశ గణతంత్ర వేడుకల్లో ఈజిప్ట్ ఆర్మీ పాల్గొంది. ఇది ఇండియా-ఈజిప్ట్ దేశాల మధ్య సంబంధాల్ని మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది. ఢిల్లీలో జరిగిన 74వ గణతంత్ర వేడుకల్లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.

Tamilisai: తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: గవర్నర్ తమిళిసై

అలాగే ఈజిప్టు సైన్యం కూడా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈజిప్ట్ సైన్యం ఈ వేడుకల్లో మార్చ్ నిర్వహించింది. కల్నల్ మొహమూద్ మొహమ్మద్ ఫత్తా ఎల్ ఖరాసావి ఆధ్వర్యంలోని 144 మంది ఈజిప్టు సైనికులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. వారి సైనిక యూనిఫాం ధరించిన సిబ్బంది పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ అతిథుల్ని ఆకట్టుకుంది. ఈజిప్ట్ అధ్యక్షుడు గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈజిప్ట్ అధ్యక్షుడిని వేడుకలకు ఆహ్వానించడం ద్వారా ఇండియా ఆ దేశంతో సంబంధాల్ని మెరుగుర్చుకోవాలి అనుకుంటోంది. వ్యాపార, వాణిజ్య సహకారాన్ని పెంపొందించుకోవాలని భావిస్తోంది.

Republic Day Celebrations: ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు.. భద్రతా ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయంటే

రాబోయే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 12 బిలియన్ డాలర్లకు పెంచాలని ప్రణాళికగా నిర్ణయించింది. ఆహారం, ఫార్మా, ఇతర రంగాల్లో సహకారానికి కూడా ఇరు దేశాధినేతలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం విస్తరిస్తుండటంపై మోదీ, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దు తీవ్రవాదాన్ని అంతమొందించే విషయంలో ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.