రంజాన్: షాపింగులకు లేని సోషల్ డిస్టెన్స్ ప్రార్థనలకు ఎందుకు?

  • Published By: Subhan ,Published On : May 24, 2020 / 03:01 PM IST
రంజాన్: షాపింగులకు లేని సోషల్ డిస్టెన్స్ ప్రార్థనలకు ఎందుకు?

ముస్లింలు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ రంజాన్. ముస్లిం కమ్యూనిటీ మొత్తం ఉపవాసాలతో పవిత్ర రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకుని సెలబ్రేషన్స్ తో పూర్తి చేసుకునే రోజు. (ఈద్ ఉల్ ఫితర్) రంజాన్ ను కూడా COVID-19మహమ్మారి కారణంగా ఇళ్లలోనే జరుపుకోవాల్సిన పరిస్థితి. జమ్మూ అండ్ కశ్మీర్, కేరళ మినహాయించి దేశవ్యాప్తంగా మే25న పండుగ జరుపుకుంటోంది. 

దీనిపై పలువురు ముస్లింలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. షాపింగ్ లకు సమయం అవసరం లేదని ఇంటి నుంచే ప్రార్థనలు చేసుకోవడానికి  అనుమతులు ఇప్పించాలని అంటున్నారు. ‘మార్కెట్లలో సోషల్ డిస్టెన్సింగ్ లేదు. అటువంటప్పుడు పండుగలకు షాపింగ్ ఎందుకు? లాక్‌డౌన్ రిలాక్సేషన్ ఇచ్చాక ప్రభుత్వం జాగ్రత్తలు విస్మరించింది. ప్రజలు జాగ్రత్తలతో కూడిన నియమాలు పాటించాలని ఢిల్లీ జామియా మసీద్ ఇమామ్ ఖలీద్ నజీబ్ సురావార్ధి అన్నారు.

దేశవ్యాప్తంగా కొన్ని చోట్లు పండుగ షాపింగ్ పేరుతో సామాజిక దూరాన్ని మర్చిపోతున్నారు దేశ పౌరులు. ప్రార్థనల విషయంలో సామాజిక దూరం అంటూ దూరంగా ఉంచి షాపింగ్ పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని దొడా అనే ప్రాంతంలో ఇటువంటి ఘటనలు నమోదవుతున్నాయి. నిజానికి అది గ్రీన్ జోన్. నిర్లక్ష్యం వహించడం తగదు. 

రాష్ట్రంలో మసీదులను మూసి ఉంచడంతో కేరళ ముస్లింలు పండుగను ఇళ్లలోనే జరుపుకున్నారు. COVID-19లాక్ డౌన్ పేరిట మసీదులు మూసే ఉంచారు. జమ్మూ కశ్మీర్ లోనూ ఇదే పద్ధతి అవలంభించారు.