World Blood Donor Day: రక్తదానం చేయడం వల్ల ఎనిమిది అద్భుత ప్రయోజనాలు.. అవేమిటో తెలుసా?

రక్తం అనేది చాలా విలువైనది. ఒకరి రక్తదానం ఎందరికో ప్రాణదానంగా మారుతుంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతీయేటా జూన్‌14న నిర్వహిస్తున్నారు. అయితే రక్తదానం చేయడం వలన శరీరంలో శక్తిపోయి నీరసం వస్తుందని ఇంకా చాలా మందిలో అపోహ ఉంది.

World Blood Donor Day: రక్తదానం చేయడం వల్ల ఎనిమిది అద్భుత ప్రయోజనాలు.. అవేమిటో తెలుసా?

Blood (1)

World Blood Donor Day: రక్తం అనేది చాలా విలువైనది. ఒకరి రక్తదానం ఎందరికో ప్రాణదానంగా మారుతుంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతీయేటా జూన్‌14న నిర్వహిస్తున్నారు. అయితే రక్తదానం చేయడం వలన శరీరంలో శక్తిపోయి నీరసం వస్తుందని ఇంకా చాలా మందిలో అపోహ ఉంది. అందుకే రక్తదానం అనగానే దూరంగా ఉంటారు. కానీ ఇది నిజంకాదు. పైగా రక్తదానంతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

Blood

సాధారణంగా ఒక వ్యక్తి తన జీవితకాలంలో 168సార్లు రక్తదానం చేయొచ్చు. ‘O’ నెగిటివ్ గ్రూపు ఉన్న వ్యక్తిని విశ్వదాత అని అంటారు. ఎందుకంటే వీరు ఏ గ్రూపు వ్యక్తులకైనా రక్తం ఇవ్వచ్చు. ‘AB’ పాజిటివ్ ఉన్న వ్యక్తులను విశ్వగ్రహీత అంటారు. వీరు ఏ గ్రూపు వ్యక్తి రక్తాన్ని అయిన స్వీకరించవచ్చు. ఆరోగ్యవంతమైన వ్యక్తిలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. స్త్రీలలో 12.5-16 గ్రాములు, పురుషుల్లో 13.5-17 గ్రాములు హిమోగ్లోబిన్ ఉన్న వ్యక్తులు రక్తం దానం చేయొచ్చు.

 

Blodd

రక్తదానం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.. వాటిలో ప్రధానమైనవి..
– శరీరంలో పాత రక్తం పోయి కొత్తరక్తంతో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ.
– బ్లడ్ సర్కులేషన్ సాఫీగా జరుగుతుంది.
– కొత్తరక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది.
– కొత్త రక్తం ఏర్పడటంతో ఉత్సాహంగా, ఫిట్ గా ఉంటారు.
– రక్తాన్ని తిరిగి తయారు చేసుకోవడానికి, కొవ్వు నిల్వలను శరీరం వాడుకోవడంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తగ్గుతారు.
– ప్రతి మూడు నెలల వ్యవధిలో ఓసారి రక్తదానం చేస్తే శరీరంలో ఐరన్ శాతం క్రమబద్దం చేయబడుతుంది.
– గుండెపోటు నుంచి దూరంగా ఉంచుతుంది.
– కొవ్వు తగ్గి బీపీ కంట్రోల్ లో ఉంటుంది.