Eight Bodies: ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలు దహనం

ఒకే చితిపై ఎనిమిది మంది మృతదేహాలను ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అంబాజ్ గాయ్‌ పట్టణంలో కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. వారిని సమీపంలో ఉన్న స్మశానవాటికలో దహనం చెయ్యాలని అధికారులు అనుకున్నారు

Eight Bodies: ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలు దహనం

New Project (33)

Eight Bodies: ఒకే చితిపై ఎనిమిది మంది మృతదేహాలను ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అంబాజ్ గాయ్‌ పట్టణంలో కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. వారిని సమీపంలో ఉన్న స్మశానవాటికలో దహనం చెయ్యాలని అధికారులు అనుకున్నారు. అయితే మృతదేహాలను దహనం చేసేందుకు స్మశాన వాటిక పక్కన ఉన్న ఇళ్లవారు ఒప్పుకోలేదు.

కరోనా మృతదేహాలను అక్కడి నుంచి తీసుకెళ్లాలని అధికారులపై తిరగబడ్డారు. దీంతో చేసేదేమి లేక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో స్మశాన వాటికకు మృతదేహాలను తీసుకెళ్లారు. అక్కడ స్థలం లేకపోవడంతో ఒకే చితిపై ఎనిమిది మంది మృతదేహాలు ఉంచి దహనం చేశారు. ఇక దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకు సుమారు 50 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా మృతుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా కేసులు మహారాష్ట్రలోనే నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇక ఈ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ లో 59,907 కొత్త కేసులు వెలుగుచూసినట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఒక లక్ష 26 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.