Cracker unit fire: బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 8 మంది మృతి, 16 మందికి గాయాలు

ఉగాది రోజున తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గాయపడ్డ 16 మందికి ఆసుపత్రులో చికిత్స అందుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Cracker unit fire: తమిళనాడులోని కాంచీపురం పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కురువిమళై గ్రామంలోని బాణసంచా పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమింది మంది మృతి చెందగా, 16 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన పరిశ్రమలో దాదాపు 25 మంది కార్మికులు పనిలో ఉన్నారని పోలీసులు చెప్పారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి ఫైరింజన్లు, సహాయక సిబ్బంది చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. బాణసంచా పరిశ్రమ నరేంద్రన్ అనే వ్యాపారికి చెందినదని తెలుస్తోంది. అది లైసెన్స్ ఉన్న బాణసంచా పరిశ్రమనా? కాదా? అనే విషయంపై స్పష్టత లేదు. గోడౌన్ లో బాణసంచా నిల్వలను ఉంచారని పోలీసులు గుర్తించారు.

మృతి చెందిన ఎనిమిది మందిలో ముగ్గురి పేర్లను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. గజేంద్రన్, భూపతి, విజయ అని చెప్పారు. ప్రమాదం జరిగాక స్థానికులే సహాయక సిబ్బందికి సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. దాదాపు 25 మంది అగ్నిమాపక సిబ్బంది 30 నిమిషాల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారని వివరించారు. ప్రమాద ఘటన ఎలా జరిగిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

TTD 2023-24 Budget : టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ రూ.4,411.68 కోట్లు

ట్రెండింగ్ వార్తలు