Durga Idol Immersion: దుర్గాదేవి విగ్రహం నిమజ్జన సమయంలో విషాదం.. నదీప్రవాహంలో కొట్టుకుపోయి ఎనిమిది మంది మృతి.. షాకింగ్ వీడియోలు..

పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విజయదశమి సందర్భంగా దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా నదిలో వరద ప్రవాహం పెరగడంతో పలువురు గల్లంతయ్యారు. వీరిలో ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు.

Durga Idol Immersion: దుర్గాదేవి విగ్రహం నిమజ్జన సమయంలో విషాదం.. నదీప్రవాహంలో కొట్టుకుపోయి ఎనిమిది మంది మృతి.. షాకింగ్ వీడియోలు..

West Bengal

Durga Idol Immersion: పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విజయదశమి సందర్భంగా దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా నదీలో వరద ప్రవాహం పెరగడంతో పలువురు గల్లంతయ్యారు. వీరిలో ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరికొందరు గల్లంతయ్యారు. బుధవారం రాత్రి 8.30గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.

Bharat JodoYatra: కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. నేడు యాత్రలో పాల్గోనున్న సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే

జుల్పైగురి కలెక్టర్ మౌమితా గోదర ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.. దుర్గాదేవి విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు మాల్ నది ఒడ్డుకు వందలాది మంది తరలివచ్చారని తెలిపారు. నదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో పదుల సంఖ్యలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారని, అయితే 50 మందిని స్థానికులు కాపాడారని, మరికొందరు గల్లంతయ్యారని తెలిపారు. స్థానికులు కాపాడినవారిలో 13 మందికి గాయాలుకాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానిక ప్రజలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ మౌమితా గోదర తెలిపారు.

జల్పైగురి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ లో స్పందించిన మోదీ.. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఇదిలాఉంటే ఈ ఘటన జరిగిన సమయంలో మాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి బులు చిక్ బరైక్ అక్కడే ఉన్నట్లు తెలిపారు. ఒక్కసారిగా నదిలో వదర ఉధృతిపెరగడం కారణంగానే ఈ విషాద ఘటన చోటు చేసుకుందని ఆయన అన్నారు.

ఇదిలాఉంటే మాల్ నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో నీటి ప్రవాహంలో అనేక మంది కొట్టుకుపోతున్న దృశ్యాలు పలువురు వీడియో తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి. ఈ వీడియోలో నదిలో ఒక్కసారిగా పెరిగిన వరదలో పలువురు కొట్టుకుపోతున్నట్లు కనిపిస్తుంది. నది ఒడ్డుకుచేరేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా, కొంతమంది తమనుతాము రక్షించుకోవడానికి ఇతరులను పట్టుకొని ఉండటం చూడొచ్చు. వారిలో చాలా మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండటం వీడియోలో కనిపిస్తుంది.