Boy Clean Bathroom: కరోనా రోగుల మరుగుదొడ్లు కడిగిన 8 ఏళ్ల బాలుడు .. వీడియో వైరల్‌

కరోనా ఐసోలేషన్ సెంటర్ లో పేషంట్లు ఉపయోగించిన మరుగుదొడ్లను 8 ఏళ్ల చిన్నారితో కడిగించిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ సంఘటన గత నెలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సంగ్రామ్‌పూర్‌ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరోడ్‌ గ్రామంని పాఠశాలలో కరోనా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు.

Boy Clean Bathroom: కరోనా రోగుల మరుగుదొడ్లు కడిగిన 8 ఏళ్ల బాలుడు .. వీడియో వైరల్‌

Boy Clean Bathroom

Boy Clean Bathroom: కరోనా ఐసోలేషన్ సెంటర్ లో పేషంట్లు ఉపయోగించిన మరుగుదొడ్లను 8 ఏళ్ల చిన్నారితో కడిగించిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ సంఘటన గత నెలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సంగ్రామ్‌పూర్‌ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరోడ్‌ గ్రామంని పాఠశాలలో కరోనా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు.

15 మంది కరోనా రోగులు ఈ సెంటర్ లో ఉన్నారు. ఐసోలేషన్ సెంటర్ ను పరిశీలించేందుకు మే 29న జిల్లా ఉన్నతాధికారులు వస్తున్నట్లు అక్కడ పనిచేస్తున్న గ్రామపంచాయితీ సిబ్బందికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే సంగ్రామ్‌పూర్‌ పంచాయితీ అధికారులు ఐసోలేషన్ సెంటర్ ను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి తెలిపారు. దీంతో క్లీనింగ్ చేసే వారికోసం గ్రామంలోకి వెళ్లి అడిగారు.. గ్రామంలోని వారు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఐసోలేషన్ సెంటర్ సిబందిలోని ఓ వ్యక్తి, బంధువుల ఇంటికి వచ్చిన 8 ఏళ్ల బాలుడిని ఐసోలేషన్ సెంటర్ కు తీసుకొచ్చాడు.

మరుగుదొడ్ల వద్దకు తీసుకెళ్లి వీటిని శుభ్రం చెయ్యాలని లేదంటే కొడతానని కట్టెతో బెదిరించాడు. అతడిని చూసి భయపడిన బాలుడు ఏడుస్తూ మరుగుదొడ్లు శుభ్రం చేశాడు. సరిగా శుభ్రం చెయ్యి అంటూ బాలుడిని మరాఠా భాషలో గద్దించాడు.. బాలుడు ఏడ్చుకుంటేనే ఆ పని చేశాడు.

పని పూర్తి కాగానే రూ.50 ఇచ్చి ఎవరికి చెప్పొద్దని అక్కడి నుంచి పంపాడు. ఇక ఈ దృశ్యాలను అక్కడ ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్ లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ బాలుడితో పనిచేయించిన వ్యక్తిని విధులనుంచి తొలగించి బాలకార్మిక చట్టం కింద కేసు నమోదు చేశారు.