Maharashtra Politics: వ్యూహం మార్చిన బీజేపీ.. ఆ అపవాదును తొలగించుకొనేందుకే షిండేకు సీఎం పదవి

మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామాకు తెరపడింది. పదిరోజులుగా మహారాష్ట్రలో రాజకీయ హైడ్రామా నడిచింది. చివరిలో తలపండిన రాజకీయ విశ్లేషకులుసైతం వూహించని రీతిలో బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మాజీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ సీఎం అవుతారని అందరూ భావించారు. కానీ బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.

Maharashtra Politics: వ్యూహం మార్చిన బీజేపీ.. ఆ అపవాదును తొలగించుకొనేందుకే షిండేకు సీఎం పదవి

Maharastra

Maharashtra Politics: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామాకు తెరపడింది. పదిరోజులుగా మహారాష్ట్రలో రాజకీయ హైడ్రామా నడిచింది. చివరిలో తలపండిన రాజకీయ విశ్లేషకులుసైతం వూహించని రీతిలో బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మాజీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ సీఎం అవుతారని అందరూ భావించారు. కానీ బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. తనపై వస్తున్న అపవాదును తొలగించుకొనేందుకు సీఎం పదవినిసైతం త్యాగం చేసింది. అనూహ్యంగా మహారాష్ట్ర సీఎంగా శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే పేరును ఫడ్నవీస్ ప్రకటించారు.

Maharashtra Politics: సుప్రీంకోర్టు‎కు మహారాష్ట్ర సంక్షోభం

మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ రోజు కేవలం సీఎంగా షిండే మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని ఫడ్నవీస్ తెలిపారు. తాను ప్రభుత్వానికి దూరంగా ఉంటానని స్పష్టంచేశారు. మంత్రి పదవుల విషయంలో బీజేపీ మెజార్టీ భాగాన్ని ఆక్రమిస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే గురువారం మధ్యాహ్నం షిండే  ప్రత్యేక విమానంలో గోవా నుంచి ముంబై చేరుకున్నారు. ముంబై చేరిన ఏక్ నాథ్ తొలుత బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు కలిసి రాజ్ భవన్ లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చించారు.

Maharashtra: మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే.. నేడే ప్ర‌మాణ స్వీకారం: ఫ‌డ్న‌వీస్ ప్ర‌క‌ట‌న‌

సీఎం పదవిని శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండేకు అప్పగించడం పట్ల బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పలు రాష్ట్రాల్లో బీజేపీకి మెజార్టీ లేకపోయినా దొంగదారిలో అధికారంలోకి వస్తుందన్న అపవాదును ఆ పార్టీ మూటగట్టుకుంది. ఈ అపవాదును తొలగించుకొనేందుకు బీజేపీ అధిష్టానం కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. మహారాష్ట్రలో సీఎం పదవిని వదులుకోవడంతో పాటు బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడం ద్వారా తాము ప్రభుత్వాలను కూల్చమని, ఆ సంస్కృతి మాదికాదన్న వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. మరోవైపు శివసేన గతంలో బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగింది. రెండు పార్టీల అజెండాలు మెజార్టీభాగం హిందుత్వమే. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడిపోయి ప్రత్యర్థులుగా మారాయి. అయినా బీజేపీ మాత్రం శివసేనతో మిత్రపక్షంగానే ఉండేందుకు ఆసక్తి చూపుతుందన్న సందేశాన్ని షిండేను సీఎం చేయడం ద్వారా వెల్లడించింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే షిండే శివసేన ఎమ్మెల్యేగానే సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఉద్ధవ్ ఠాక్రే సైతం షిండేకు సీఎం పదవి బీజేపీ ఇస్తుందంటే తానుకూడా సంతోషిస్తానంటూ ఇటీవల వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యల నేపథ్యంలో షిండేకు సీఎం పదవి అప్పగించడం ద్వారా, తిరిగి శివసేన, బీజేపీ మధ్య మంచి సంబంధాలు కొనసాగేలా బీజేపీ అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న వాదన దేశ రాజకీయాల్లో వినిపిస్తుంది.