Maharashtra: ఉద్ధవ్‭కు కౌంటర్ ఇవ్వడం కోసం బీజేపీ వ్యతిరేకితో చేతులు కలిపిన షిండే

బలమైన హిందుత్వ భావజాలం ఉన్న శివసేన రెండు వర్గాలు ఇలా ఒక్కసారిగా అంబేద్కర్ భావజాలం ఉన్న వారితో పొత్తు పెట్టుకోవడం రాజకీయ పండితుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు గ్రూపులకు రెండు జాతీయ పార్టీలతో పొత్తు ఉంది. అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో అంబేద్కర్ భావజాలం ఉన్న రాజకీయాతో కలిసి ప్రయాణించుకోవాలనుకోవడం పట్ల విశ్లేషకులకు అంతు చిక్కడం లేదు

Maharashtra: ఉద్ధవ్‭కు కౌంటర్ ఇవ్వడం కోసం బీజేపీ వ్యతిరేకితో చేతులు కలిపిన షిండే

Eknath Shinde’s new-found Dalit partner Jogendra Kawade is old BJP-RSS critic

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో కాస్త వింతైన పొత్తులు వెలుగు చూస్తున్నాయి. కొంత కాలం క్రితం కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కలయికే అందరినీ ఆశ్చర్యంలో ముంచేయగా, తాజాగా కుదురుతున్న పొత్తులు మరింత ఆశ్చర్యానికి లోను చేస్తున్నాయి. వంచిత్ బహుజన్ అగాడీ పార్టీ నేత ప్రకాష్ అంబేద్కర్‭తో శివసేన (ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ థాకరే పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. రెండు నెలలుగా సాగుతున్న ఈ చర్చల్లో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. కొందరు వీరి కలయికను అంబేద్కర్-శివాజీ కలయికగా పోలుస్తున్నారు. కొందరు ఈ కలయికపై అయమయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Iran: ఎట్టకేలకు నిరసనకు తలొగ్గిన ఇరాన్ ప్రభుత్వం.. జైలు నుంచి విడుదలైన ఆస్కార్ విన్నింగ్ మూవీ నటి అలిదూస్తి

ఇక ఉద్ధవ్ థాకరేకు కౌంటర్‭గా మరో వింతైన కలయికకు ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే తెరలేపారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షిండే, బీజేపీ బద్ధ వ్యతిరేకిని తాజా పొత్తుకు ఆహ్వానించడం గమనార్హం. వాస్తవానికి ఇది థాకరేకు కౌంటరనే అనుకున్నప్పటికీ, బీజేపీకి కూడా మింగుడు పడని కలయికగా మారింది. పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకుడు అయిన జోగేంద్ర కవాడేతోతో షిండే చేతులు కలిపారు. ఈయన చాలా కాలంగా బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రధాన వ్యతిరేకుల్లో ఒకరుగా ఉన్నారు.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న అచ్చం రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి

బలమైన హిందుత్వ భావజాలం ఉన్న శివసేన రెండు వర్గాలు ఇలా ఒక్కసారిగా అంబేద్కర్ భావజాలం ఉన్న వారితో పొత్తు పెట్టుకోవడం రాజకీయ పండితుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు గ్రూపులకు రెండు జాతీయ పార్టీలతో పొత్తు ఉంది. అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో అంబేద్కర్ భావజాలం ఉన్న రాజకీయాతో కలిసి ప్రయాణించుకోవాలనుకోవడం పట్ల విశ్లేషకులకు అంతు చిక్కడం లేదు. మహా వికాస్ అగాడీలో ఉన్న శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావొచ్చు. అలాగే షండేకు సైతం బీజేపీ నుంచి ఇబ్బందులు తలెత్తొచ్చు. ఈ విషయం తెలిసి కూడా ఇద్దరు నేతలు పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. అయితే ఇది మహారాష్ట్ర రాజకీయాలను ఏ మలుపుకు తిప్పుతుందనేది చూడాలి.