Magnetism: మాగ్నెటిక్ ఉమెన్.. శరీరానికి వస్తువులు అతుక్కుపోతున్నాయంతే

దేశవ్యాప్తంగా చాలా మందిలో మ్యాగ్నెటిజం లక్షణాలు కనిపించాయి. అదే తరహాలో బెంగాల్ లోని బరాసత్ కు చెందిన 66ఏళ్ల మహిళలోనూ అదే లక్షణాలు కనిపించాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ఇలా జరిగిందంటూ చాలా మంది ఆరోపించారు.

Magnetism: మాగ్నెటిక్ ఉమెన్.. శరీరానికి వస్తువులు అతుక్కుపోతున్నాయంతే

Magentism

Magnetism: దేశవ్యాప్తంగా చాలా మందిలో మ్యాగ్నెటిజం లక్షణాలు కనిపించాయి. అదే తరహాలో బెంగాల్ లోని బరాసత్ కు చెందిన 66ఏళ్ల మహిళలోనూ అదే లక్షణాలు కనిపించాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ఇలా జరిగిందంటూ చాలా మంది ఆరోపించారు. కానీ, అనీమా నస్కార్ (66)అనే మహిళ అటువంటి ఆరోపణలేమీ చేయకుండా ఈ స్వభావాన్ని ఎంజాయ్ చేస్తున్నానని అంటున్నారు.

ఆమె కొడుకు తనపై చేసిన ప్రయోగంతో విషయం వార్తల వరకూ వెళ్లింది. ‘నార్త్ బెంగాల్ లో ఇదే రకమైన లక్షణాలు కనిపించాయని టీవీలో చూసి తెలుసుకున్నా. ఆ వ్యక్తి మాత్రం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే తన స్వభావం మారిందని చెప్పాడు. నా వరకూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను. నా కొడుకు కాయిన్లు, స్టీల్ సామాన్లు చేతిపై అతికించేందుకు ప్రయత్నించగా అతుక్కున్నాయి’ అని అనీమా నస్కార్ అన్నారు.

దీనిపై స్థానిక ప్రభుత్వాధికారులకు సమాచారం ఇచ్చారు. వ్యాక్సిన్ ను బ్లేమ్ చేయకుండా తన శరీర తీరు ఇలా ఎందుకు మారిందో తెలుసుకోవాలని ఉందని ఆమె ఎదురుచూస్తున్నారట.

‘వ్యాక్సిన్ ను బ్లేమ్ చేయడం లేదు. వ్యాక్సిన్స్ ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నాయనేది నిజం. ఏదైనా రియాక్షన్ జరిగి ఉండొచ్చు. టాల్కమ్ పౌడర్ రాసుకుంటే శరీరంపై నుంచి వస్తువులు జారిపోతున్నాయని’ ఆమె కొడుకు అన్నాడు.