2021 ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి.. సిట్టింగ్ సీఎంకే టిక్కెట్ దక్కలేదు

పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ..మాజీ సీఎం నారాయణస్వామి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. పుదుచ్చేరిలో అవినీతి మాత్రమే ఉందని, అభివృద్ధి మాత్రం లేదని మోడీ ఆరోపించారు.

2021 ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి.. సిట్టింగ్ సీఎంకే టిక్కెట్ దక్కలేదు

Election 2021 Unique Since Even Sitting Cm Denied A Ticket

Election 2021  పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ..మాజీ సీఎం నారాయణస్వామి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. పుదుచ్చేరిలో అవినీతి మాత్రమే ఉందని, అభివృద్ధి మాత్రం లేదని మోడీ ఆరోపించారు. అభివృద్ధిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రభుత్వ అవినీతి గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బహిరంగంగా ఆరోపణలు చేశారని ఆయన గుర్తు చేశారు. అవినీతిలో మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారన్నారు.

తనకుకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని..తాను చాలా ఎన్నికలు చూశానని..కానీ పుదుచ్చేరి 2021ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని మోడీ అన్నారు. సిట్టింగ్​ సీఎం నారాయణ స్వామికే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకపోవడం ఇదే తొలిసారని మోడీ అన్నారు. చాలా ఏళ్లు నమ్మకంగా ఉన్నా.. తమ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునేందుకు తప్పుడు అనువాదాలు చేసినా.. ఆయనకు టికెట్‌ దక్కలేదని మోడీ అన్నారు.

కాగా,ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక డీఎంకే ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఫిబ్రవరి 22న బలపరీక్షకు ముందు నారాయణ స్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే,ఏప్రిల్-6న జరగనున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కారణం ఆయనకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడమే. నారాయణ స్వామికి ఎన్నికల ప్రచారం, నిర్వహణ బాధ్యతలను కాంగ్రెస్ అప్పగించింది.