ఎలక్షన్ మనీ : ప్రచారానికి వస్తే టీవీలు, బైక్స్, బంగారం

ఎలక్షన్ మనీ : ప్రచారానికి వస్తే టీవీలు, బైక్స్, బంగారం

మరి కొద్ది రోజుల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే హడావుడి మొదలైపోయింది. ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న రాజకీయ నాయకులు.. వెనుకాడకుండా మాటిచ్చేస్తున్నారు. ఓట్ల కోసం ఎంతవరకైనా వరాలు కురిపిస్తూ.. వయస్సుల వారీగా, వర్గాల వారీగా ఆకట్టుకునేందుకు సన్నాహాలను ముమ్మరం చేస్తున్నారు. 

ఫిబ్రవరి 7 గురువారం ఓ ఇంగ్లీషు మీడియా కథనంలో అస్సాం ప్రభుత్వం నూతన వధువుకు రూ.38వేలు ఇస్తున్నట్లు ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ పదో తరగతి పాసైన విద్యార్థినుందరికీ ఎలక్ట్రానిక్ బైక్‌లు ఇస్తామంటూ వాగ్దానం చేశాడు. దాంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంవత్సరంలో రూ.50వేల ఎడ్యుకేషన్ లోన్‌లను ఎత్తి వేస్తున్నట్లు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.

 

అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం 2వేల మంది క్రీడాకారులకు రూ.50నగదు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికల వరాల బరిలో కేవలం అస్సాం రాష్ట్రమే కాదు, మధ్య ప్రదేశ్‌లో కూడా ఓట్లు దండుకునేందుకు అధికార పార్టీ వరాల జల్లులు కురిపించేస్తుంది. నిరుద్యోగ భృతి రూ. 4వేలు, ఇక రాజస్థాన్ విషయానికొస్తే రూ.3నుంచి 5వేల వరకూ ఉంది. కొత్తగా ఎన్నికైన ఎంపీ.. సీఎం కమల్ నాథ్ కూడా గ్రామీణ యువతకు వంద రోజుల పనిని ఇప్పిస్తామని హామీలు ఇచ్చేశారు.

 

ఇలా చేనేత కార్మికులకు రూ.2.3లక్షల రుణాలిస్తామని, కేరళ వరద బాధితలకు జీఎస్టీలో ప్రత్యేక తగ్గింపులు ఇప్పిస్తామని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా వాగ్దానాలు చేసేస్తున్నాయి.