ఎన్నికల్లో గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం

  • Published By: chvmurthy ,Published On : March 21, 2019 / 07:29 AM IST
ఎన్నికల్లో గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం

హైద‌రాబాద్‌: ఏప్రిల్ 11నుంచి జరిగే లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీల ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకు, అభ్యర్ధులకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఇందులో భాగంగా 76 పార్టీలకు గుర్తులను కేటాయించింది. ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితికి  ‘బాక్సు’ గుర్తును ఈసీ కేటాయించింది. అలాగే తెలంగాణలోని 10 స్థానాలకు పోటీ చేస్తున్న ‘అన్న వైఎస్సార్ కాంగ్రెస్’ పార్టీకి బ్యాట్స్ మెన్ గుర్తును ఇచ్చింది.
Read Also : కేసీఆర్ పాలన చూసే టీఆర్ఎస్‌లో చేరా : నామా

ఇది కాక తెలంగాణలోనే పోటీ చేస్తున్న మరో పార్టీ  భారతీయ రాష్ట్రీయ మోర్చాకు 16 స్థానాలకు బెంచ్‌ గుర్తు ఇచ్చింది. ఏపీలోని 13 స్థానాలకు ఫుట్ బాల్ ఆటగాడి గుర్తును కేటాయించింది. అలాగే మార్క్సిస్ట్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు తెలంగాణలోని 4 లోక్‌సభ స్థానాలకు కంప్యూటర్‌ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.
Read Also : టీ టీడీపీ కి మరో షాక్: టీఆర్ఎస్ లో చేరనున్న మహిళా నేత