హర్యానా, మహారాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా

  • Published By: madhu ,Published On : September 21, 2019 / 04:21 AM IST
హర్యానా, మహారాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా

మరోసారి దేశంలో ఎన్నికల నగరా మోగనుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 21వ తేదీ శనివారం మధ్యాహ్నం వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీపావళికి ముందే ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు సమావేశమై ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ చేయనున్నారని సమాచారం. షెడ్యలూ్ విడుదల అయిన వెంటనే ఇరు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఇదిలా ఉంటే జార్ఖండ్ ఎన్నికలు తర్వాత జరిపే ఆలోచనలో ఎన్నికల అధికారులున్నట్లు టాక్. జార్ఖండ్‌ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ ముగుస్తుంది. 

మహారాష్ట్రలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ – ఎన్సీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. సీట్ల పంపకాలు విషయంపై పార్టీలు తర్జనభర్జనలు పడుతున్నాయి. బీజేపీ – శివసేన పొత్తులపై క్లారిటీ రావడం లేదు. రెండు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పుంజుకోవద్దని భావిస్తున్న ఆ పార్టీ చీఫ్ అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. లోక్ సభలో ఘోర పరాభవాన్ని చవి చూసిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పుంజుకోవాలని భావిస్తోంది. 

హర్యానాలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకుని ప్రజాసేవకు అవకాశం కల్పించాలని కోరుతూ 90 నియోజకవర్గాల్లో సీఎం కట్టర్ ఆగస్ట్-18న జన్ ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ముగింపు సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 10స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి బీజేపీని ప్రజలు ఆశీర్వదించబోతున్నారని మోడీ అన్నారు.

Read More : రిలీఫ్ : చింతపండుపై GST ఎత్తివేత, హోటల్ గదులు చౌక

మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 సీట్లు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలున్నాయి.
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు 2014 అక్టోబర్‌లో ఎన్నికలు జరిగాయి. 
సెప్టెంబర్ 20న నోటిఫికేషన్..అక్టోబర్ 15న పోలింగ్..అక్టోబర్ 19న ఫలితాలను రిలీజ్ చేశారు.