ఆ ట్వీట్లను తక్షణమే డిలీట్ చేయండి : ట్విట్టర్ కు ఈసీ సూచన

2019 సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మే 19తో చివరి దశ పోలింగ్ ముగియనుంది. మే 23న ఎన్నికల ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

  • Published By: sreehari ,Published On : May 16, 2019 / 10:30 AM IST
ఆ ట్వీట్లను తక్షణమే డిలీట్ చేయండి : ట్విట్టర్ కు ఈసీ సూచన

2019 సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మే 19తో చివరి దశ పోలింగ్ ముగియనుంది. మే 23న ఎన్నికల ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మే 19తో చివరి దశ పోలింగ్ ముగియనుంది. మే 23న ఎన్నికల ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల వేళ కోడ్ అమల్లో ఉండటంతో పోలింగ్, ఫలితాలు, ప్రచారానికి సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయరాదని ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఎన్నికలు ముగిసిన వెంటనే.. సర్వేలు, ఎగ్జిట్ ఫలితాల హడావుడి మొదలవుతుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలకు సూచనలు చేసింది. సోషల్ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ ఇండియా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ట్విట్టర్ ప్లాట్ ఫాంలో ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన ట్వీట్లును వెంటనే డిలీట్ చేయాల్సిందిగా సూచించినట్టు ఓ నివేదిక వెల్లడించింది. 

ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ట్విట్టర్ లో ట్వీట్లపై ఈసీకి ఫిర్యాదులు అందడంతో ఈ దిశగా చర్యలు చేపట్టింది. ‘ఈసీఐ నుంచి ఎలాంటి జనరల్ ఆర్డర్ జారీ కాలేదు. కానీ, ఓ ట్విట్టర్ యూజర్ పోలింగ్ ట్వీట్ చేసి.. తనకుతానే డిలీట్ చేసినట్టు ఈసీ దృష్టికి వచ్చింది’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాలను పబ్లిష్ చేస్తున్నారనే ఆరోపణలతో మూడు మీడియా సంస్థలకు నోటీసులు జారీచేసినట్టు చెప్పారు.

126A రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ (RPA) ప్రకారం.. ఎవరైనా వ్యక్తి ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ కండక్ట్ చేయకూడదు. ఎన్నికల ఫలితాలపై ఫ్రింట్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించడం, ప్రసారం చేయరాదు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడో దశ ఎన్నికల పోలింగ్ మే 19న జరుగనుంది. మొత్తం 543 స్థానాలకు జరిగిన పోలింగ్ ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి.