సుమలత, నిఖిల్ కు ఈసీ షాక్...సినిమా ప్రసారాలపై నిషేధం

సుమలత, నిఖిల్ కు ఈసీ షాక్…సినిమా ప్రసారాలపై నిషేధం

ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్‌ గౌడలకు ఈసీ షాక్ ఇచ్చింది.

సుమలత, నిఖిల్ కు ఈసీ షాక్…సినిమా ప్రసారాలపై నిషేధం

ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్‌ గౌడలకు ఈసీ షాక్ ఇచ్చింది.

ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్‌ గౌడలకు ఈసీ షాక్ ఇచ్చింది. దూరదర్శన్‌లో వీరి సినిమాల ప్రసారంపై నిషేధం విధించింది.మండ్యలో ఎన్నికలు పూర్తయ్యేవరకూ సుమలత, నిఖిల్‌ గౌడల సినిమాలు దూరదర్శన్‌లో ప్రసారం చేయకూడదంటూ ఈసీ ఆదేశాలు జారీచేసింది. అయితే ప్రయివేటు టీవీ ఛానళ్లకు ఈ నిషేధం వర్తించవు.
Read Also : చంద్రబాబు సెటైర్: ఫ్యాన్ ఏపీలో.. స్విచ్ హైదరాబాద్‌లో.. కరెంట్ ఢిల్లీలో

కాంగ్రెస్, జేడీఎస్ లు టిక్కెట్ నిరాకరించడంతో మండ్యా లోక్ సభ స్థానం నుంచి దివంగత మాజీ మంత్రి అంబరీష్ భార్య సుమలత బరిలోకి దిగడం,సీఎం కుమారుడు నిఖిల్ గౌడ అదే స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవడంతో మండ్యాలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.మరోవైపు మండ్యా విషయంలో కన్నడ సినీ పరిశ్రమ కూడా రెండుగా విడిపోయింది.

శాండిల్ వుడ్ అగ్రహీరోలు యష్,దర్శన్ వంటి వాళ్లు బహిరంగానే సుమలతకు మద్దతు ప్రకటించగా,మరికొందరు నిఖిల్ కు తమ మద్దతు తెలిపారు. అయితే ఎవరెంత ప్రచారం చేసినా విజయం తనదే అన్న ధీమాలో నిఖిల్,తన భర్త నియోజకవర్గ ప్రజలకు చేసిన మంచి పనులే తనకు విజయం చేకూరుస్తాయన్న ధీమాలో సుమలత ఉన్నారు. మరోవైపు వీరి పోటీపై మండ్యాలో భారీ స్థాయిలో బెట్టింగ్ లు జరుగతున్నట్లు సమాచారం.మండ్యాలో జేడీఎస్ కు మంచి పట్టు ఉంది.
Read Also : మోడీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది

×