Election Commission: ఎక్కడినుంచైనా ఓటేయొచ్చు.. రిమోట్ ఈవీఎం మెషీన్లు సిద్ధం చేస్తున్న ఎన్నికల సంఘం

ఏ ప్రాంతం నుంచైనా తమ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో ఓటువేసేలా రిమోట్ ఈవీఎంలను ఎన్నికల సంఘం సిద్దం చేస్తోంది. ఉద్యోగ, ఉపాధి, ఇతర అవసరాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వాళ్లకు ఈ మెషీన్లు ఉపయోగపడతాయని ఎన్నికల సంఘం చెబుతోంది.

Election Commission: ఎక్కడినుంచైనా ఓటేయొచ్చు.. రిమోట్ ఈవీఎం మెషీన్లు సిద్ధం చేస్తున్న ఎన్నికల సంఘం

Election Commission: దేశంలోని పౌరులు ఇకపై ఎక్కడినుంచైనా ఓటేయొచ్చు. ఏ ప్రాంతం నుంచైనా తమ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో ఓటువేసేలా రిమోట్ ఈవీఎంలను ఎన్నికల సంఘం సిద్దం చేస్తోంది. ఉద్యోగ, ఉపాధి, ఇతర అవసరాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వాళ్లకు ఈ మెషీన్లు ఉపయోగపడతాయని ఎన్నికల సంఘం చెబుతోంది.

Putin Presents Gold Rrings : 8 దేశాల అధ్యక్షులకు బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చిన పుతిన్

ముఖ్యంగా వలస కార్మికులకు దీని ద్వారా మేలు జరుగుతుంది. సొంతూళ్లకు వెళ్లకుండానే, తాము ఉన్న ప్రాంతం నుంచే ఓటు వేసే అవకాశం కలుగుతుంది. విదేశాల్లో ఉంటున్న వాళ్లకు కూడా రిమోట్ ఈవీఎం ద్వారా ఓటు వేసే అవకాశం దక్కుతుంది. ఈ మెషీన్ పనితీరును పార్టీలకు వివరించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. జనవరి 16న రిమోట్ ఈవీఎంలపై ఈసీ డెమో నిర్వహించనుంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలను ఈసీ ఆహ్వానించింది. ఈ మెషీన్ల పనితీరు, వీటి చట్టబద్ధత, నిర్వహణ, సాంకేతికత, సమస్యలు వంటి అంశాలపై ఈసీ పార్టీలతో చర్చిస్తుంది. పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తుంది. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన ఓట్ల శాతం 67.4 మాత్రమే.

Gautam Adani: మోదీ కాదట, రాజీవ్ గాంధీనట.. పారిశ్రామికవేత్తగా తన ఎదుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గౌతమ్ అదానీ

అంటే దాదాపు 30 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకోయారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. వలస వెళ్తున్న వాళ్లలో 85 శాతం మంది సొంత రాష్ట్రంలోనే ఉంటున్నారు. ఇలాంటి వాళ్లకు సులభంగా ఓటు వేసే అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈసీ.. రిమోట్ ఈవీఎంలను తీసుకొస్తోంది. దేశంలో వలసలకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. తాజాగా అభివృద్ధి చేసిన రిమోట్ ఈవీఎం.. ఒక్క దాంట్లోనే ఏకంగా 72 నియోజకవర్గాలకు సంబంధించి ఓటు వేయొచ్చు.