రాహుల్ కి ఈసీ క్లీన్ చిట్

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2019 / 02:32 AM IST
రాహుల్ కి ఈసీ క్లీన్ చిట్

బీజేపీ చీఫ్ అమిత్ షా హత్య కేసులో నిందితుడంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించలేదు. అది ఎన్నికల ప్రవర్తనా నిమమావళి ఉల్లంఘన కిందికి రాదంటూ గురువారం(మే-3,2019)రాహుల్ కి క్లీన్‌చిట్ ఇచ్చింది.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్-23న మధ్యప్రదేశ్ లోని సిహోరా జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ హత్య కేసును ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ… హత్య కేసులో నిందితుడైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎంత గ్రాండ్‌ గా ఉన్నారు. మీరు ఎప్పుడైన జయ్‌ షా పేరు విన్నారా? ఆయన ఒక ఇంద్రజాలికుడు. ఆయన రూ.50,000ను మూడు నెలల్లో రూ.80 కోట్లు చేశారు రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఓ నకిలీ ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌ స్టర్ సోహ్రబుద్దీన్‌ ను హతమార్చారంటూ 2005లో అమిత్ షా మీద కేసు నమోదైంది. అయితే తగిన ఆధారాలు లేవన్న కారణంతో న్యాయస్థానం 2014లో ఆయన్ను నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే.