ఎంత కష్టమొచ్చింది.. గాడిదలు, గుర్రాల వేటలో ఎన్నికల అధికారులు

త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. రాజకీయ పార్టీల సంగతి పక్కన పెడితే, ఈ ఎన్నికలు అధికారులకు పెద్ద కష్టమే తెచ్చిపెట్టాయి. ఎన్నికల అధికారులకు గాడిదలు, గుర్రాల అవసరం వచ్చింది. అవి ఎక్కడ ఉన్నాయా అని భూతద్దం పెట్టి మరీ వెతుకున్నారు.

ఎంత కష్టమొచ్చింది.. గాడిదలు, గుర్రాల వేటలో ఎన్నికల అధికారులు

election officers in search of donkeys, horses:త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. రాజకీయ పార్టీల సంగతి పక్కన పెడితే, ఈ ఎన్నికలు అధికారులకు పెద్ద కష్టమే తెచ్చిపెట్టాయి. ఎన్నికల అధికారులకు గాడిదలు, గుర్రాల అవసరం వచ్చింది. అవి ఎక్కడ ఉన్నాయా అని భూతద్దం పెట్టి మరీ వెతుకున్నారు.

అదేంటి.. ఈ రోజుల్లో గాడిదలు, గుర్రాల అవసరం ఏముంది? వాహనాలు ఉన్నాయి కదా మరి అవెందుకు అనే సందేహం రావొచ్చు. గుర్రాల అవసరం ఉందంటే, ఓకే, కానీ గాడిదలతో వారికి ఏం పని? అనే డౌట్ రావొచ్చు. అవును, అధికారులకు గుర్రాలు, గాడిదలు కావాల్సిందే. మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే, అక్కడ కొన్ని గిరిజన గ్రామాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లాలంటే రోడ్డు మార్గం లేదు. దీంతో అవే దిక్కయ్యాయి.

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు గాడిదలు, గుర్రాల కోసం వేట ప్రారంభించారు. తేని జిల్లాలో పశ్చిమ కనుమలకు చేరువగా 30కిపైగా చిన్నిచిన్న గిరిజన గ్రామాలున్నాయి. వాహనాలు అక్కడికి వెళ్లేందుకు అనువైన రోడ్డు సౌకర్యం లేకపోవడం ఇప్పుడు అధికారుల పీకలమీదికి వచ్చింది. ఈ గ్రామాల్లో దాదాపు పదింటికి అసలు రోడ్డే లేదు. దీంతో గిరిజనులు కాలినే నమ్ముకుని బతుకులు వెళ్లదీస్తున్నారు.

ఈ నేపథ్యంలో అక్కడికి పోలింగ్ సామగ్రిని తరలించి ఎన్నికలు నిర్వహించడం ఎలాగన్న విషయంలో అధికారులకు పెద్ద చిక్కొచ్చిపడింది. దీంతో గాడిదలు, గుర్రాల ద్వారా పని కానివ్వాలని నిర్ణయించారు. వాటి ద్వారా మాత్రమే ఎన్నికల సరంజామాను తరలించడం వీలవుతుందని భావిస్తున్న అధికారులు గుర్రాలు, గాడిదల కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

అధికారులకు అవసరమైన ఫర్నిచర్, ఈవీఎంలు, నీళ్ల సీసాలు, అట్టపెట్టెలు తదితర వాటిని తరలించేందుకు గాడిదలు, గుర్రాలను అద్దెకు తీసుకోమంటూ సిబ్బందిని అధికారులు ఆదేశించారు. దీంతో తేని జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బంది వాటి కోసం వెతుకులాట మొదలుపెట్టారు.