Assembly Polls: ఎన్నికల అధికారులు ఎక్స్ ట్రా కొవిడ్ డోస్ తీసుకోవాలి

ఎన్నికల అధికారులను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పరిగణిస్తూ.. అర్హత కలిగిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం సూచించారు.

Assembly Polls: ఎన్నికల అధికారులు ఎక్స్ ట్రా కొవిడ్ డోస్ తీసుకోవాలి

Cec

Assembly Polls: ఎన్నికల అధికారులను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పరిగణిస్తూ.. అర్హత కలిగిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం సూచించారు. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా జరిగిన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖాండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు శనివారం షెడ్యూల్ ను కన్ఫామ్ చేశారు. ‘ఎన్నికల అధికారులు, ఉద్యోగులు ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పరిగణనలోకి వస్తారు. అర్హత కలిగిన వారంతా ప్రికాషనరీ డోస్ తీసుకోవాలి’ అని సుశీల్ తెలిపారు.

‘ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన పుట్టిస్తుండగా.. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, హోం కార్యదర్శి, నిపుణులు, రాష్ట్ర కార్యదర్శులతో చర్చిస్తున్నాం. ఇవన్నీ గమనించిన తర్వాతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భద్రతా ప్రమాణాల మధ్య ఎన్నికలు జరపాలని నిర్ణయించాం’

ఇది కూడా చదవండి : 68 మంది సీబీఐ సిబ్బందికి కరోనా

’80ఏళ్లు అంతకంటే పైబడ్డవారు, దివ్యాంగులు, కొవిడ్ పేషెంట్లు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయొచ్చు. జనవరి 15వరకూ ఎటువంటి బహిరంగ ప్రచారాలు జరగకూడదు. ఎప్పటికప్పుడూ కమిషన్ పరిస్థితిని సమీక్షిస్తూనే ఉంటుంది. ఎటువంటి పాదయాత్ర, రోడ్ షోలు, సైకిల్, బైక్ ర్యాలీలు జరగడానికి వీల్లేదు’ అని సీఈసీ స్పష్టం చేసింది.