బీహార్ లో ముగిసిన ఎన్నికల పోలింగ్, ఎగ్జిట్ పోల్స్ విడుదల

  • Published By: madhu ,Published On : November 7, 2020 / 06:25 PM IST
బీహార్ లో ముగిసిన ఎన్నికల పోలింగ్, ఎగ్జిట్ పోల్స్ విడుదల

Election polling ends in Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం మూడో విడత పోలింగ్ జరిగింది. 19 జిల్లాల్లో 78 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ఈనెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.



పీపుల్ పల్స్ : కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్ష కూటమికే స్వల్ప, అధిక్యత లభించే అవకాశం. ఆర్జేడీకి 85-95 సీట్లు, బీజేపీ 65-75, కాంగ్రెస్ కు 15-20 సీట్లు.
ఎల్ జేపీ 3-5 సీట్లు, జేడీ (యూ) 25-35 సీట్లు, వామపక్షాలు 3-5 సీట్లు. జీడీఎస్ఎప్ & ఇండిపెండెంట్లు 5-13 సీట్లు.



టైమ్స్ నౌ – సీ ఓటర్ :
ఎన్డీయే 116, యూపీఏ 120, ఎల్జేపీ 1, ఇతరులు 6
ఏబీపీ న్యూస్ : ఎన్డీయే 104 – 128, యూపీఏ 108 – 131, ఎల్జేపీ 1 – 3, ఇతరులు 4 – 8.
జన్ కీ బాత్ : ఎన్డీయే 91 – 117, యూపీఏ 118 – 138,న ఎల్జేపీ 5 – 8, ఇతరులు 3 -6.



తేజస్వీ యాదవ్ వైపు 36 శాతం, నితీశ్ కుమార్ వైపు 34 శాతం మంది మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు. బీహార్ లో అక్టోబర్ 28న తొలి దశ, నవంబర్ 03న రెండో దశ, నవంబర్ 07వ తేదీన మూడో దశ ఎన్నికలు జరిగాయి.