Election Results 2022: నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. మరికాసేపట్లో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Election Results 2022: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. మరికాసేపట్లో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లలో ఏయే పార్టీలు అధికారంలోకి రానున్నాయి..? ఎవరు పైచేయి సాధిస్తారు..? అక్కడున్న అధికార పక్షానికి ధీటుగా నిలిచేదెవరు.. గెలిచేదెవరు..? అనేది దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది.

5 States Election Results : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. Live Updates

రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ఓటరు మహాశయుని తీర్పును ఏంటన్నది నేడు తేలనుంది. ఇక, ప్రస్తుతం ఎన్నికలు జరిగిన యూపీలో మొత్తం 403 సీట్లు ఉండగా.. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాలు 202. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందు వరకూ యూపీలో బీజేపీ గెలుపు తథ్యమని అందరూ భావించారు. అయితే, షెడ్యూల్ విడుదల తర్వాత పరిస్థితి మారిపోయింది.

UP Election : ఈవీఎంలపై ఆరోపణలు, వారణాసి అధికారి సస్పెండ్

ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపీ గట్టిపోటీని ఎదుర్కొంది. బీజేపీ, ఎస్పీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. అటు, పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫిబ్రవరి 20న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ అధికార కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాళీదల్-బీఎస్పీ కూటమి ప్రధానంగా పోటీ పడ్డాయి. మాజీ సీఎం అమరీందర్‌కు చెందిన జనలోక్ కాంగ్రెస్‌తో బీజేపీ జట్టుకట్టి పోటీ చేసింది. ఇక్కడ బీజేపీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది.

Five State Elections: రిసార్ట్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు, హోటల్ లో బీజేపీ మీటింగ్: అభ్యర్థులను కాపాడుకుంటున్న పార్టీలు

ఇక, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్, బీజేపీలే హోరాహోరీగా తలపడ్డాయి. ఐదేళ్లకు ఒకసారి అధికార మార్పిడి జరిగే సంప్రదాయం కొనసాగుతుందా? లేదా? అనేది నేడు తెలిపోనుంది. మణిపూర్‌లో 60 సీట్లకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ కూడా అధికార బీజేపీ కూటమితో కాంగ్రెస్ కూటమి మధ్య ప్రధాన పోటీ.

UP Election 2022 : ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి, ఖండించిన సీఈసీ

గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌, టీఎంసీలు పోటీపడ్డాయి. కాగా, నేడు ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేయగా.. ఉదయం 8 గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. ఈ విధుల్లో సుమారు 50 వేల మంది పైగా ఉద్యోగులు పాల్గొననున్నారు.

Five States Election : ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్ని సీట్లు అవసరం, వివరాలు

ట్రెండింగ్ వార్తలు