Prashant Kishor: గుజరాత్, హిమాచల్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయం: ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని పీకే జోష్యం చెప్పారు

Prashant Kishor: గుజరాత్, హిమాచల్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయం: ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్

Pk

Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని పీకే జోష్యం చెప్పారు. ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన టచింతన్ శివిర్ట సమావేశాల పై స్పందించిన ప్రశాంత్ కిశోర్..శుక్రవారం ఒక ట్వీట్ చేశారు. “ఉదయపూర్ ‘చింతన్ శివిర్’ సమావేశాల ఫలితంపై స్పందించాలని కొందరు పదే పదే అడిగారు. నా దృష్టిలో, అర్థవంతమైన ఫలితం సాధించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కనీసం గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల పరాజయం వరకు, పార్టీ తన హోదాను కాపాడుకోవడం, అధిష్టానానికి కొంత సమయం దొరికింది” అంటూ ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు.

కాగా 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం..ఆమేరకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ సేవలు వినియోగించుకోవాలని భావించింది. ఈక్రమంలోనే పీకే సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినా..అనుకోని కారణాల వలన అది సాధ్యపడలేదు. అయితే 2024 ఎన్నికల వరకైనా కాంగ్రెస్ తో పీకే సంబంధం కొనసాగుతుందా అనే విషయంపైనా ఇప్పుడు స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు..ప్రజల్లో పార్టీపై నమ్మకం కలిగించే దిశగా అధిష్టానం కృషిచేస్తుంది. ఈక్రమంలో పలుమార్లు అధినేత్రి సోనియాతో భేటీ అయిన పీకే ఆ విషయాలపై చర్చించారు.

Other Stories:Uttar Pradesh : యూపీలో శ్రీరాముడి గుడిని అమ్మేసిన పాకిస్థాన్ వ్యక్తి..! దేవాలయాన్ని కూల్చేసి…హోటల్ నిర్మాణం

అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశాల్లో పలు కీలక మార్పులను పీకే ప్రతిపాదించగా..కొందరు నేతలు వాటిని వ్యతిరేకించారు. ఈక్రమంలో పార్టీలో సంస్థాగతంగా పేరుకుపోయిన సమస్యలను అధిష్టానం వద్ద ప్రస్తావించిన పీకే..పరివర్తన సంస్కరణలు అమలు చేయకుంటే పార్టీకి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. అయినా పీకే ప్రతిపాదనలపై ఎటూ తేల్చుకోలేని కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతానికి ఆ విషయాలను పక్కన పెట్టింది. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై పీకే వెనక్కు తగ్గి..వ్యూహకర్తగానే సేవలు అందిస్తానని పేర్కొన్నారు.