Madhya Pradesh : కరెంటు షాక్‌‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేస్తుండగా కరెంటు షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. దీంతో ఇతర కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పటి వరకు తమతో ఉన్న వారు విగతజీవులుగా మారడంతో..కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. 

Madhya Pradesh : కరెంటు షాక్‌‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

Mp

Electric Shock Kills 6 :  కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాగే..ఓ ఘటన జరిగింది. సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేస్తుండగా కరెంటు షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. దీంతో ఇతర కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పటి వరకు తమతో ఉన్న వారు విగతజీవులుగా మారడంతో..కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం..ఛతార్ పూర్ జిల్లాలో…మహాజ్వాల గ్రామం ఉంది. ఇది బీజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆ గ్రామంలో ఓ ఇంట్లో సెప్టిక్ ట్యాంకు నిర్మాణం చేపడుతున్నారు. పై కప్పు స్లాబ్ వేయడానికి ఉపయోగించే షట్టర్ ప్లేట్లను తొలగించడానికి ఇంట్లో ఉన్న ఒకరు ట్యాంకులోకి దిగాడు.

Read More : Kandahar Consulate : తాలిబన్ ఎఫెక్ట్..ప్రత్యేక విమానంలో ఢిల్లీకి కాందహార్ కాన్సులేట్ సిబ్బంది

ట్యాంక్ లో లైటింగ్ ఏర్పాట్లు ఉండడం..కరెంటు పలకలపైకి వ్యాపించింది. దీంతో అతనికి కరెంటు షాక్ తగిలింది. ఇతనికి కాపాడటానికి మరొకరు వెళ్లగా..అతనికి కరెంటు షాక్ తగిలింది. వీరిద్దరూ స్పృహ కోల్పోవడంతో మరొకరు..ఇంకొకరు..ఇలా..నలుగురు ప్రయత్నించారు. వీరందరూ కరెంటు షాక్ తగిలి కుప్పకూలిపోయారు. స్థానికులు గమనించి..వీరిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వారు అప్పటికే చనిపోయారని వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్ర్భంతి వ్యక్తం చేశారు.