విద్యుత్ లేని గ్రామంలో వింత కష్టం : కరెంట్ మీటర్లు ఇచ్చిన ఉత్తరాఖండ్ బిల్లులు కట్టాలంటున్న యూపీ

విద్యుత్ లేని గ్రామంలో వింత కష్టం : కరెంట్ మీటర్లు ఇచ్చిన ఉత్తరాఖండ్ బిల్లులు కట్టాలంటున్న యూపీ

Electricity Bill Meter Uttarakhand Up Rampur People Problem 

electricity bill meter uttarakhand up rampur people problem  : భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ పాలకులు చెప్పే గప్పాలకు కొదువ లేదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు దాటుతున్నా దేశాలో చాలా గ్రామాలకు..ప్రాంతాలకు విద్యుత్ సదుపాయం కూడా లేదు. అటువంటి ఓ గ్రామం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఉన్న రామ్‌పూర్ జిల్లాలోని రాజ్‌పూర్ గ్రామం. ఈ గ్రామానికి ఇప్పటి వరకూ కరెంట్ సదుపాయం లేదు. కానీ..విద్యుత్ సదుపాయం లేకున్నా..గానీ ఈ గ్రామస్తులు విద్యుత్ బిల్లుల కష్టాలు పడుతున్నారు. అదేంటీ కరెంటే లేని గ్రామానికి కరెంట్ బిల్లుల కష్టమేంటీ? అనే డౌట్ వస్తుంది.అదే రజ్‌పూర్ గ్రామవాసుల వింత కష్టం..

1

ఉత్తరాఖండ్- ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉంది రాజ్‌పూర్ గ్రామం. ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేదు. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ గ్రామానికి విద్యుత్ సదుపాయం కల్పించటానికి ఏర్పాట్లు చేసింది. రామ్‌పూర్‌ జిల్లా విద్యుత్ శాఖ 2018లో రాజ్‌పూర్ గ్రామంలో విద్యుత్ స్థంభాలను ఏర్పాటు చేసింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కూడా ఏర్పాటుచేసింది.

2

అలాగే గ్రామంలోని ఇళ్లకు విద్యుత్ మీటర్లను కూడా బిగించింది. కానీ విద్యుత్ సరఫరా మాత్రం చేయలేదు. గ్రామంలోని ఎవరికీ విద్యుత్ సదుపాయం అందుబాటులోకి రాలేదు. అన్ని ఏర్పాట్లు చేసిన విద్యుత్ శాఖ కరెంట్ ఎప్పుడిస్తుందాని గ్రామస్తులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

3

కానీ విచిత్రంగా విద్యుత్ సరఫరాయే లేని రాజ్‌పూర్ గ్రామానికి విద్యుత్ చార్జీలు కట్టాలంటూ బిల్లులు వచ్చాయి. అదికూడా తమ సరిహద్దులోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యుత్ శాఖ అధికారుల నుంచి..అది చూసిన గ్రామస్థులు షాక్ అయ్యారు. కరెంటే లేని మీటర్లకు బిల్లులు కట్టాలా? పైగా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన బిల్లులు రావటమేంటీ? అంటూ షాక్ అయ్యారు కరెంట్ షాకులు లేని రాజ్ పూర్ గ్రామస్తులు..!

8

యూపీ నుంచి భారీగా బిల్లులు వస్తుంటం చూసి గ్రామస్తులకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో స్థానికులు విద్యుత్ అధికారుల వద్దకెళ్లి మొరపెట్టుకున్నారు. కరెంటే లేని మాకు బిల్లులు రావటమేంటీ? అంటూ వాపోయారు. అటువంటి ఓ కరెంట్ బిల్లు బాధితుడైన సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ..మా రాజ్ పూర్ గ్రామంలో 11 వేల విద్యుత్ లైన్లు వేశారు అధికారులు..కానీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు..ఇది చాలదన్నట్లుగా ఇటీవలి కాలంలో ఉత్తర‌ప్రదేశ్ నుంచి తమ ఖాళీ విద్యుత్ మీటర్లకు సంబంధించిన బిల్లులు వస్తున్నాయని వాపోయాడు.

6

కరెంటే లేని మీటర్లకు ఆరువేల రూపాయల వరకూ బిల్లులు వస్తున్నాయని తెలిపారాయన. అలాగే విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ తమకు ఫోన్ లకు మెసేజ్‌లు కూడా వస్తున్నాయని..వెంటనే కట్టకపోతే ఫైన్లు కూడా వేస్తామని అంటున్నారని వాపోయారు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రాజ్ పూర్ గ్రామస్తులు.