ఏం ఖర్మరా బాబూ : ఆఫీసులో హెల్మెట్ పెట్టుకుని పని చేస్తున్న ఉద్యోగులు

  • Published By: veegamteam ,Published On : November 4, 2019 / 10:25 AM IST
ఏం ఖర్మరా బాబూ : ఆఫీసులో హెల్మెట్ పెట్టుకుని పని చేస్తున్న ఉద్యోగులు

టూ వీలర్ మీద వెళ్లేవాళ్లు హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే అది వారి సేఫ్టీ కోసం. కానీ ఉత్తరప్రదేశ్ లో ఆఫీస్ లో కూర్చుకుని పనిచేసే ఉద్యోగులు హెల్మెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఎందుకంటే సేఫ్టీ కోసం. అదేంటీ ఆఫీస్ కుర్చీలో ఫ్యాన్ కింద కూర్చుని పనిచేసేవారికి ఏం ప్రమాదం జరుగుతుందని హెల్మెట్ పెట్టుకోవాల్సి వచ్చింది? అనే డౌట్ అందరికీ వస్తుంది. ఎందుకంటే ఆ భవనం పై పెచ్చులు ఊడి వారి నెత్తిమీద పడుతున్నాయట. అందుకని యూపీలోని బాండాలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు హెల్మెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఇదేం ఖర్మరా బాబూ అంటూ వాపోతున్నారు. 

ఎలక్ట్రిసిటీ ఆఫీస్ బిల్డింగ్ శిధిలావస్థకు చేరుకుందని..ఎప్పుడు పెచ్చులు ఊడి మీద పడతాయో..ఎవరి బుర్రలు పగులుతాయో అనే భయంతో వేరే దారి లేక హెల్మెట్లు పెట్టుకుని పనిచేయాల్సి వస్తోందంటున్నారు. ఈ విషయంపై అధికారులతో ఎన్నిసార్లు విన్నవించుకున్నామనీ కానీ ఎటువంటి ఫలితం లేదన్నారు. 

దీంతో విసిగిపోయి సేఫ్టీ కోసం ఇలా హెల్మెట్లు పెట్టుకుని గత రెండేళ్లు ఇలాగే పనిచేస్తున్నామని వాపోయారు. బిల్డింగ్ కు మరమ్మతులు చేయించమని నెత్తీనోరూ కొట్టుకుని చెప్పినా అధికారులు మాత్రం  పట్టించుకోవడం లేదని.. లిఖితపూర్వకంగా కూడా పరిస్థితిని వివరించినా ఎలాంటి మార్పు లేదని ఉద్యోగులు చెప్పారు. పెచ్చులు ఊడి మీద పడకుండా హెల్మెట్లు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ భయంభయంగా పనిచేస్తున్నామని ఉద్యోగులు వాపోయారు.