Viral Video: ఏనుగు తొండంపై కర్రతో కొడుతూ రెచ్చగొట్టిన యువకుడు

ఏనుగు తొండంపై కర్రతో కొడుతూ ఆ గజరాజును రెచ్చగొట్టాడు ఓ యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సరేందర్ మెహ్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Viral Video: ఏనుగు తొండంపై కర్రతో కొడుతూ రెచ్చగొట్టిన యువకుడు

Viral Video: ఏనుగు తొండంపై కర్రతో కొడుతూ ఆ గజరాజును రెచ్చగొట్టాడు ఓ యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సరేందర్ మెహ్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

‘‘ఇది పిచ్చితనం’’ అని పేర్కొన్నారు. ఓ అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు వద్దకు వెళ్లారు ఇద్దరు యువకులు. వారిలో ఒక యువకుడు పొడవాటి కర్రతో ఓ ఏనుగు తొండంపై కొట్టాడు. దాన్ని మరింత రెచ్చగొడుతూ అలాగే, మూడు-నాలుగు సార్లు కొట్టాడు. దీంతో అతడిపైకి ఏనుగు దూసుకువచ్చింది. కేవలం నాలుగు క్షణాల పాటు ఉన్న ఈ వీడియోను ఫారెస్ట్ సర్వీస్ అధికారి పోస్ట్ చేసిన కొద్ది సేపటికే బాగా వైరల్ అయింది.

Viral News: దేవుడి పాదాలపై తలపెట్టి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. వీడియో వైరల్

ఏనుగులతో చెలగాటం ఆడిన యువకుడిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ యువకుడిని వెంటనే అరెస్టు చేయాలని కొందరు డిమాండ్ చేశారు. మనుషులు ఇలా చేస్తున్నారు కాబ్టటే కొంత కాలంగా అటవీ జంతువులు మానవులపై దాడులు చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయని కొందరు పేర్కొన్నారు. గతంలోనూ పలు చోట్ల చోటుచేసుకున్న ఇటువంటి ఘటనలను కొందరు ప్రస్తావించారు. ఏనుగును రెచ్చగొట్టే పనులు చేస్తే మనిషుల ప్రాణాలకే ప్రమాదమని ఓ నెటిజన్ హెచ్చరించాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..