Elon Musk: 2022లో ఫస్ట్ డే.. మస్క్ ఆదాయం రూ. 2.53లక్షల కోట్లు

2021లో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ ఏడాది కూడా అప్రతిహత విజయాలతో దూసుకుని పోతున్నాడు.

Elon Musk: 2022లో ఫస్ట్ డే.. మస్క్ ఆదాయం రూ. 2.53లక్షల కోట్లు

Elon Musk

Elon Musk: 2021లో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ ఏడాది కూడా అప్రతిహత విజయాలతో దూసుకుని పోతున్నాడు. మస్క్ ఆదాయం సోమవారం.. అంటే 2022లో స్టాక్ మార్కెట్‌లో మొదటి రోజు 33.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2.53 లక్షల కోట్లు) పెరిగింది. మస్క్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా షేర్ ధర విపరీతంగా పెరగడమే అందుకు కారణం.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, టెస్లా CEO ఎలోన్ మస్క్ విలువ $304 బిలియన్లు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా ఉన్నారు. గతేడాది ఎలోన్ మస్క్ మొత్తం ఆస్తుల నికర విలువ 340 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో అతను అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్‌ను దాటేశాడు. ఈ ఏడాది కూడా మస్క్ చాలా లాభాలు గడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బెజోస్ నికర విలువ 196 బిలియన్ డాలర్లు.

టెస్లా స్టాక్‌:
మస్క్ సంపద పెరగడానికి కారణం ప్రధానంగా టెస్లా షేర్లు. సోమవారం టెస్లా షేర్లు 13.5% పెరిగి $1,199.78కి చేరుకున్నాయి. మస్క్ మొత్తం టెస్లా షేర్లలో 18శాతం వాటా కలిగి ఉన్నారు. టెస్లా కార్ల అమ్మకాలు వరుసగా ఆరు త్రైమాసికాలుగా పెరుగుతూ ఉన్నాయి. దీని కారణంగా, టెస్లా స్టాక్ ధర విపరీతంగా పెరిగింది. సోమవారం కంపెనీ షేరు 13.5 శాతం పెరిగి 1,199.78 డాలర్లకు చేరుకుంది.

మస్క్‌కు చెందిన EV తయారీ కంపెనీ టెస్లా.. 2021లో ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ యూనిట్లను డెలివరీ చేసింది. ఈ ఏడాది చివరి త్రైమాసికంలోనే కంపెనీ 3 లక్షల యూనిట్ల ఎలక్ట్రికల్ వెహికల్స్‌ని డెలివరీ చేసింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారతదేశంలోకి కూడా త్వరలో ప్రవేశించడానికి సిద్ధమైంది. గత ఏడాది కర్ణాటకలోని బెంగళూరులో కంపెనీని పెట్టేందుకు రిజిస్టర్ చేసుకుంది.