Elon Musk: తాజ్‌మహల్‌ను గుర్తుచేసుకున్న ఎలాన్ మస్క్.. ఇండియా టూర్ ఖరారైందా?

ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఎలాన్ మస్క్. టెస్లా సీఈఓ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన నాటి నుండి ట్విటర్‌లో వరుస ట్వీట్లతో హల్ చల్ చేస్తున్నాడు. తాజాగా మస్క్ ఆసక్తికర..

Elon Musk: తాజ్‌మహల్‌ను గుర్తుచేసుకున్న ఎలాన్ మస్క్.. ఇండియా టూర్ ఖరారైందా?

Elon Musk

Elon Musk: ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఎలాన్ మస్క్. టెస్లా సీఈఓ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన నాటి నుండి ట్విటర్‌లో వరుస ట్వీట్లతో హల్ చల్ చేస్తున్నాడు. తాజాగా మస్క్ ఆసక్తికర ట్వీట్ చేశాడు.. భారత్ దేశంలోని ప్రముఖ కట్టడమైన తాజ్‌మహల్‌ను మస్క్ గుర్తు చేసుకున్నాడు. ట్విటర్‌లో ఓ నెటిజర్ ఆగ్రాలోని ఎర్రకోటను వర్ణిస్తూ ఓ ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన మస్క్ రీ ట్వీట్ చేస్తూ.. అదొక అద్భుతం అంటూ పొగిడారు. 2007లో నేను భారత్‌కు వచ్చినప్పుడు దానిని సందర్శించాను. అలాగే తాజ్‌మహల్‌ను వీక్షించాను అంటూ ట్వీట్ చేశాడు. తాజ్‌మహల్ నిజంగా ప్రపంచ వింత, ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటూ మస్క్ ట్వీట్ చేశాడు. మస్క్ చేసిన ట్వీట్ భారత్‌లో వైరల్‌గా మారింది.

Elon musk : నేను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే.. ఎలాన్ మస్క్ ట్వీట్.. మత్తులో ఉన్నారా అంటూ..

ఈ క్రమంలో పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మ స్పందిస్తూ.. మొదటి టెస్లా కారును డెలీవరి చేయానికి ఇండియా ఎప్పుడు వస్తున్నారు అంటూ మస్క్‌ను ప్రశ్నించారు. మస్క్ నుంచి ఎలాంటి రిప్లై రాకపోయినా.. త్వరలో మస్క్ భారత్‌లో పర్యటిస్తారన్న ఊహాగానాలు నెలకొన్నాయి. మస్క్ ఏదైనా ట్వీట్ చేశాడంటే దాని వెనుక ఓ అర్థముంటుందని, తాజాగా ఏరికోరి మస్క్ ఇండియాకు సంబంధించిన అద్భుత కట్టడాలపై ట్వీ్ట్ చేశాడంటే త్వరలో భారత్ పర్యటనకు ఎలాన్ మస్క్ వచ్చే అవకాశాలున్నాయని ప్రముఖ వ్యాపారవేత్తలు పేర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్తా భారత ప్రవేశంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది.

భారత్‌లో విద్యుత్ వాహనాల (ఈవీ) దిగుమతిపై 100శాతం సుంకం ఉందని, దీన్ని తగ్గించాలని టెస్లా కోరుతోంది. కొంతకాలం పాటు దిమతి చేసిన కార్లను విక్రయిస్తామని, ప్రజల స్పందన బట్టి తయారీ యూనిట్ ను నెలకొల్పుతామని సంస్థ పేర్కొంది. కానీ అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ క్రమంలో భారత్ ప్రభుత్వం, టెస్లా కంపెనీ మధ్య చర్చలు జరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ తో మస్క్ భారత్ కు త్వరలో వస్తున్నారన్న ఊహాగానాలు నెలకొన్నాయి. మరి మస్క్ భారత్‌కు ఎప్పుడు వస్తారనేది వేచి చూడాల్సిందే.