అనుకున్నదొక్కటి..అయినదొక్కటి : కేజ్రీవాల్ సభలో ఖాళీ కుర్చీలు

  • Published By: venkaiahnaidu ,Published On : February 24, 2019 / 02:16 PM IST
అనుకున్నదొక్కటి..అయినదొక్కటి : కేజ్రీవాల్ సభలో ఖాళీ కుర్చీలు

చండీగఢ్ లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని పరిణామం ఎదురైంది.చండీగఢ్ లో  ఆప్ నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి స్పందన కరువైంది. ఆదివారం ప్రజలు వస్తారని భావించిన ఆప్ నేతలు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఖాళీ కుర్చీలు దర్శమివ్వడంతో షాక్ అయిన కేజ్రీవాల్ మొక్కుబడి ప్రసంగం చేశారు.  తనను క్షమించాలని, హర్యానాలో వేరొక మీటింగ్ లో తాను పాల్గొనాల్సి ఉందని అక్కడి నుంచి బయటపడ్డారు. 

షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నాం 1:30 గంటలకు కేజ్రీవాల్ స్పీచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కుర్చీలన్నీ ఖాళీగా ఉండటంతో ఇంకా వస్తారేమో అని మరో గంట ఆలస్యంగా చేశారు. అప్పటికి కూడా ఎవ్వరూ పెద్దగా రాకపోవడంతో కొన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడిన కేజ్రీవాల్…చండీగఢ్ బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ పై విమర్శలు గుప్పించారు. అటు లోక్ సభకు గానీ, ఇటు చండీగఢ్ కు గానీ ఆమె తన ఫేస్ చూపించరని ఆరోపించారు. కిరణ్ ఖేర్ ని మీరు ఎన్నిసార్లు చండీగఢ్ లో చూశారు అని ప్రజలనుద్దేశించి కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆమె చాలా బిజీ నటురాలని, ముంబైలో నివసిస్తుందని అన్నారు. ఆమె చేసిన ఏదైనా ఒక్క అభివృద్ధి పని ఉందా అని ప్రశ్నించారు. మాజీ బీజేపీ నేత హర్ మోహన్ ధావన్ ని ఆప్ 2019లో చండీగఢ్ నుంచి ఆప్ బరిలోకి దించనుంది.