పుల్వామాలో ఎన్‌కౌంటర్ : ఇంటిని పేల్చేసి ఉగ్రవాదిని మట్టుబెట్టారు

జమ్మూకాశ్మీర్ పుల్వామాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. త్రాల్‌ ప్రాంతంలోని గోల్ మసీద్‌లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ఇంటిని

  • Published By: veegamteam ,Published On : March 5, 2019 / 03:16 AM IST
పుల్వామాలో ఎన్‌కౌంటర్ : ఇంటిని పేల్చేసి ఉగ్రవాదిని మట్టుబెట్టారు

జమ్మూకాశ్మీర్ పుల్వామాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. త్రాల్‌ ప్రాంతంలోని గోల్ మసీద్‌లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ఇంటిని

జమ్మూకాశ్మీర్ పుల్వామాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. త్రాల్‌ ప్రాంతంలోని గోల్ మసీద్‌లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు చేశారు.

చాలాసేపు ఇరువర్గాల మధ్య ఫైరింగ్ జరిగింది. చివరికి భద్రతా బలగాలు ఆ ఇంటిని పేల్చేశాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఉగ్రవాది కోసం గాలిస్తున్నారు. మంగళవారం(మార్చి-5.-2019) తెల్లవారుజామున 4.30గంటల నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి.
Also Read : అప్లయ్ చేసుకోండి: ఇంటర్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం, జీతం రూ.49వేలు

పుల్వామా జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారింది. దీంతో భద్రతా దళాలు అక్కడ ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ముష్కరులను ఏరిపారేసే పనిని ముమ్మరం చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా టెర్రరిస్టుల కోసం సెర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి తర్వాత… దాడి సూత్రధారులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

ఇప్పుడు మరో ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామా దాడి తర్వాత జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని భద్రతా దళాలు కంటిన్యూ చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో 5గురు జవాన్లను కోల్పోవడం జరిగింది.
Also Read : గురి చూసి కొట్టారు : పాక్ డ్రోన్‌ను కూల్చేసిన భారత్